Digvesh – Abhishek: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో.. మరో కొత్త గొడవ తెరపైకి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దిగ్వేష్ సింగ్ మధ్య రచ్చ జరిగింది. సోమవారం రోజున లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడిన నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ అవలీలగా విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా… లక్నో బౌలర్లను అభిషేక్ శర్మ చీల్చి చెండాడు. దీంతో లక్నో బౌలర్లు అందరూ… చాలా విసిగిపోయారు. ఈ నేపథ్యంలోనే లక్నో బౌలర్ దిగ్వేష్ సింగ్ అలాగే అభిషేక్ శర్మ మధ్య గొడవ జరిగింది.
Also Read: Preity Zinta: శ్రేయస్ ను కాదని వైభవ్ కు ప్రీతీ జింటా హాగ్.. 14 ఏళ్ళ కుర్రాడితో ఏంటి అరాచకం ?
దిగ్వేష్ వర్సెస్ అభిషేక్ శర్మ వార్
లక్నో వర్సెస్ హైదరాబాద్ మధ్య జరిగిన 61వ మ్యాచ్ లో దిగ్వేష్, అభిషేక్ శర్మ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. లక్నో బౌలర్లను చీల్చి చెండాడిన అభిషేక్ శర్మ వికెట్… దిగ్వేష్ బౌలింగ్ లో పడింది. సాధారణంగా వికెట్ తీసిన తర్వాత లక్నో ఆటగాడు దిగ్వేష్ రెచ్చిపోతాడు అన్న సంగతి తెలిసిందే. మొదట్లో చేతి పైన ఏదో సిగ్నేచర్ మూమెంట్… చేసిన దిగ్వేష్.. ఆ తర్వాత వికెట్లు తీసిన తర్వాత భూమి పైన కూడా సిగ్నేచర్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేసిన ప్రతిసారి దిగ్వేష్ పై భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలు తీసుకుంది. అయితే 59 పరుగుల వద్ద అవుట్ అయిన అభిషేక్ శర్మాను ఉద్దేశించి కూడా దిగ్వేష్ సింగ్ రతి కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. సిగ్నేచర్ మూమెంట్ ఇచ్చి.. గ్రౌండ్ నుంచి నువ్వు వెళ్ళిపో అంటూ అభిషేక్ శర్మను చూస్తూ సైగలు చేశాడు. ఇది గమనించిన అభిషేక్ శర్మ… వెంటనే రియాక్ట్ అయ్యాడు. ఎవర్రా నువ్వు అన్నట్లుగా ముందుకు వచ్చి గొడవ పెట్టుకున్నాడు. గొడవ కొంచెం సేపు అలాగే జరిగితే ఇద్దరు కొట్టుకునే వాళ్ళు. ఈ నేపథ్యంలో లక్నో ప్లేయర్లు అలాగే అంపైర్ వీళ్ళ గొడవ మధ్యలో జోక్యం చేసుకోవడంతో అక్కడితో ఆగిపోయింది.
నీ గుండు గీకిస్తా అంటూ అభిషేక్ వార్నింగ్
అనంతరం అక్కడి నుంచి పెవిలియన్ కు వెళ్లిపోయాడు అభిషేక్ శర్మ. అయితే పెవిలియన్ కు వెళ్ళేటప్పుడు నీ జుట్టు కత్తిరిస్తా.. నీ గుండు గీకిస్తా అన్నట్లుగా సైగల్ చేస్తూ… వెళ్లిపోయాడు అభిషేక్ శర్మ. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన హైదరాబాద్ అభిమానులు… చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. అరేయ్ దిగ్వేష్ ఎవర్రా నువ్వు… మా కాటేర్ అమ్మ కొడుకు అభిషేక్ శర్మ నువ్వు అంటావా..? నీ అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో అతనికి గుండు కొట్టినట్లు పోస్టులు కూడా పెడుతున్నారు.
Also Read: BCCI on PCB: పాకిస్థాన్ కు షాక్.. BCCI అదిరిపోయే స్కెచ్.. ఇక ఆసియా కప్ జరిగే ఛాన్స్ లేదుగా !
#LSGvsSRH #abhisheksharma Rishabh Pant Goenka
Abhishek Sharma and Digvesh Rathi
Engaged in a fierce fight..
Abhishek Sharma pic.twitter.com/NV9RFM2Cyd— Killer Cool 🇮🇳 (@KillerCool13) May 19, 2025