Shriya Bhupal: అక్కినేని ఫ్యామిలీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) అన్నపూర్ణ (Annapurna)ను మాత్రమే భాగస్వామిగా చేసుకున్నారు. ఆయన మరో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడరు అని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించేవి . ఒకటే భార్య ఒకటే భర్త అనే సూత్రాన్ని పాటించిన అక్కినేని నాగేశ్వరరావు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. కానీ ఆయన వారసులు మాత్రం రెండేసి చొప్పున వివాహాలు చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) దగ్గుబాటి రామానాయుడు (Daggubati Ramanaidu) వారసురాలు లక్ష్మీ (Lakshmi)ని మొదట వివాహం చేసుకొని.. నాగచైతన్య (Naga Chaitanya) జన్మించిన తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి, ప్రముఖ హీరోయిన్ అమల (Amala)ను వివాహం చేసుకున్నారు. వీరి బంధానికి గుర్తుగా అఖిల్ (Akhil)జన్మించారు.
అఖిల్ తో నిశ్చితార్థం బ్రేకప్ చేసుకున్న శ్రియా భూపాల్..
కనీసం నాగార్జున కొడుకులైనా ఒకటే వివాహంతో జీవితాన్ని కొనసాగిస్తారు అనుకుంటే.. అది కూడా జరగలేదు. నాగార్జున పెద్ద కొడుకు ప్రముఖ హీరో నాగచైతన్య మొదట సమంత (Samantha) ను ఏడేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుని నాలుగేళ్లకే ఆమెతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల (Shobhita dhulipala) తో గత ఏడాది ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే. ఇక అన్న బాటలోనే తమ్ముడు అఖిల్ (Akhil) కూడా నడిచారు. గతంలో శ్రియా భూపాల్ (Shriya Bhupal తో ఎంగేజ్మెంట్ చేసుకొని.. చివరికి ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక ఈ ఏడాది ప్రముఖ నటి జైనాబ్ రవ్ డ్జీ (Zainab Ravdjee)తో ఏడడుగులు వేశారు. దీంతో అఖిల్ తో నిశ్చితార్థం బ్రేక్ చేసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శ్రియా భూపాల్ ఇప్పుడు ఎక్కడ? ఏం చేస్తోందంటే?
అసలు విషయంలోకి వెళ్తే.. 2016లో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియ భూపాల్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే అప్పుడు అఖిల్ వయసు కేవలం 22 సంవత్సరాలు అని వార్తలు వైరల్ అయ్యాయి. అంటే అక్కినేని హీరోకి ఆమెకి దాదాపు 4ఏళ్ల తేడా.. ఇక విచిత్రం ఏమిటంటే ఇప్పుడు అఖిల్ పెళ్లి చేసుకున్న అమ్మాయి వయసు కూడా అఖిల్ కంటే పెద్ద అని అంటున్నారు. ఇకపోతే అఖిల్ తో పెళ్లి రద్దు చేసుకున్న ఈ శ్రియ భూపాల్ ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే.. ఈమె హైదరాబాదులో అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకటైన జీవికే వారి వారసురాలు. ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ మేకర్ కూడా.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్స్ స్కూల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్ లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లో పట్టభద్రురాలు అయింది. ఇక ఈమె సమంత, కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) వంటి టాలీవుడ్ సెలబ్రిటీలకు డిజైన్లు అందించింది. అంతేకాదు ‘ శ్రీయ సోమ్’ అనే దుస్తుల బ్రాండ్ కి వ్యవస్థాపకురాలు కూడా.. ప్రస్తుతం ఈమె లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నా.. తన పనిలో మాత్రం బిజీగానే ఉన్నారని సమాచారం
శ్రియా భూపాల్ వివాహం చేసుకున్న వ్యక్తి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఇక అఖిల్ తో బ్రేకప్ అయిన తర్వాత తెలంగాణ రాజకీయ నాయకుడు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడైన అనిందిత్ రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక కూతురు కూడా ఉంది. ఇక ఈయన కూడా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్ గా నిలిచిన ఈయన.. 2016లో యూరో జె కే 16 చాంపియన్షిప్, యూరో జే కే 17 ఛాంపియన్షిప్ లలో పాల్గొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాలో 2017లో మోటార్స్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ గా కూడా నిలిచాడు..ఈయన టాలెంట్ చూసి అందరూ ఫిదా అవుతున్నారు.