CM Revanth Reddy: టాలీవుడ్ పరిశ్రమ గురించి తన మనసులోని కోరికను బయటపెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. తెలంగాణ రైజింగ్-2047 ప్రణాళికలో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఉండాలన్నది నా ఆకాంక్షగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి తన మనసులోని ఆలోచనలను బయటపెట్టారు.
వివిధ కారణాలతో దశాబ్దంపాటు ఫిల్మ్ అవార్డ్సు ప్రధానోత్సవ కార్యక్రమం ఆగిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంది అవార్డు స్థానంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరుతో వేడుకలు నిర్వహించింది రేవంత్ సర్కార్. శనివారం రాత్రి ఆ అవార్డు వేడుక అంగరంగం వైభవంగా జరిగింది.
ఒకప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ అంటే తెలుగు ఇండస్ట్రీ అని మాత్రమే అనేవారని, అందుకు హైదరాబాద్ వేదికైందన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ విషయాన్ని మీరు నిరూపించినట్టు రాష్ట్ర ప్రభుత్వం తరపున అభినందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఆదివారం ఉదయం ఎక్స్ వేదికగా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మనసులోని మాట బయపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ‘నిద్రలో కనేది కల.. నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొలిపేది కళ.. ఆ కళకు ప్రాణంపోసే సినీ పరిశ్రమను గుర్తించి, గౌరవించే సాంప్రదాయాన్ని ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించిందన్నారు.
ALSO READ: తెలంగాణ ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరిత, ఢిల్లీలో కూడా
తెలంగాణ చైతన్యానికి ప్రతీక.. తన గళంతో జనంలో స్ఫూర్తిని నింపిన పతాక గద్దరన్న స్మృతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్”ను ప్రారంభించు కోవడం ఆనందంగా ఉందని రాసుకొచ్చారు.
తెలంగాణ రైజింగ్-2047 ప్రణాళికలో సినీ పరిశ్రమకు ఒక చాప్టర్ ఉండాలన్నది నా ఆకాంక్షగా ప్రస్తావించారు సీఎం రేవంత్. మన రాష్ట్రం-2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలన్నారు. అందులో సినీ పరిశ్రమ వాటా ఉండాలనే ఆ స్థాయికి పరిశ్రమ ఎదగడానికి ప్రజా ప్రభుత్వం నుండి అవసరమైన సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.
హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకల్లో గడచిన 10 ఏండ్ల సినిమాలకు అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక అభినందనలు’ అని రాసుకొచ్చారు. రెండు దశాబ్దాల పాటు క్రియా శీలక రాజకీయాల్లో ఉంటానని, తాను ఏ హోదాలో ఉన్నా మీకు అండగా ఉంటానని చెప్పకనే చెప్పారు. చిత్ర పరిశ్రమకు ఈ విధంగా ప్రొత్సాహం ఇచ్చినవారు లేరని అనుకోవడం అక్కడికి వచ్చినవారు అనుకోవడం ఆ వేడుకల్లో కనిపించింది.
నిద్రలో కనేది కల.
నిద్రపోతున్న సమాజాన్ని…
మేల్కొలిపేది కళ.
ఆ కళకు ప్రాణంపోసే సినీ పరిశ్రమను…
గుర్తించి, గౌరవించే సాంప్రదాయాన్ని…
ప్రజా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది.తెలంగాణ చైతన్యానికి ప్రతీక…
తన గళంతో జనంలో…
స్ఫూర్తిని నింపిన పతాక…
గద్దరన్న స్మృతిలో…
రాష్ట్ర… pic.twitter.com/umfo7aXBGQ— Revanth Reddy (@revanth_anumula) June 15, 2025