BigTV English

RCB IPL Playoffs : బెంగళూరుకు కొత్త టెన్షన్.. 18వ తేదీ విలన్ గా మారనుందా..?

RCB IPL Playoffs : బెంగళూరుకు కొత్త టెన్షన్.. 18వ తేదీ విలన్ గా మారనుందా..?

RCB IPL Playoffs :  :  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)  టీమ్ ఈ సీజన్ లో ఇప్పటికే ప్లే ఆప్స్ కి చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ (IPL) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓడినా.. గెలిచినా ఆ జట్టు కి ఉన్నటువంటి క్రేజీ మరే జట్టుకు లేదనే చెప్పాలి. వాస్తవానికి గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కి ఉండేది. గత రెండు సీజన్ల నుంచి ఆ జట్టు ప్లే ఆప్స్ కి కూడా చేరుకోకుండానే ఇంటిదారి పట్టింది. ధోనీ(Dhoni) టీమిండియా కి రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత చెన్నై జట్టును నడిపించినా.. తను ఫామ్ లో లేకపోవడంతో ఎవ్వరూ అంతగా రాణించడం లేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక్క టైటిల్ సాధించకపోయినా.. టీమిండియా కీలక క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)  ఆ జట్టులో ఉండటంతో ఆ జట్టు క్రేజీ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి.


Also Read :  Preity Zinta: శ్రేయస్ ను కాదని వైభవ్ కు ప్రీతీ జింటా హాగ్.. 14 ఏళ్ళ కుర్రాడితో ఏంటి అరాచకం ?

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు ఒక లెక్క అంటూ విరాట్ కోహ్లీ(Virat Kohli) అభిమానులు పేర్కొంటున్నారు. అయితే తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత ఏడాది ఆర్సీబీ ప్రారంభంలో తడబడింది. చివరి 8 మ్యాచ్ లు వరుసగా విజయాలు సాధించి ప్లే ఆప్స్ కి అర్హత సాధించింది. అయితే ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ప్లే ఆప్స్ కి అర్హత సాధించింది. అయితే గత ఏడాది కూడా మే 18న ప్లే ఆప్స్ కి అర్హత సాధించింది. అయితే ఆ సీజన్ లో ప్లే ఆప్స్ కి చేరినప్పటికీ ఆర్సీబీ ఇంటిదారి పట్టింది. అంతకంటే ముందే విరాట్ కోహ్లీ జెర్సీ నెం.18.. మేము 18వ తేదీన ప్లే ఆప్స్ కి అర్హత సాధించామని.. ఈ సీజన్ లో టైటిల్ మాదే అని ప్రగల్భాలు పలికారు. కానీ చివరికీ ఇంటి దారి పట్టక తప్పలేదు.


అయితే ఈ ఏడాది కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)  జట్టు.. మొన్న కోల్ కతా మ్యాచ్ తో జరిగిన మ్యాచ్ లో వర్షం కారణంగా చెరో పాయింట్ లభించింది. దీంతో కేకేఆర్ ఇంటికి వెళ్లి.. ఆర్సీబీ ప్లే ఆప్స్ కి చేరుకుంది. దీంతో ఈ సీజన్ లో కూడా కూడా ఆర్సీబీ మే 18న ప్లే ఆప్స్ కి చేరుకుంది. ఈ సారి కూడా అలాగే టైటిల్ సాధించకుండా రిపీట్ అవుతుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆప్స్ కి చేరువైందన్న సంతోషం ఉన్నప్పటికీ.. మరోవైపు గత ఏడాది రిజల్ట్స్ రిపీట్ అవుతుందా..? అనే ఆలోచన కూడా లేకపోలేదు. మొత్తానికి గత ఏడాది ఆర్సీబీ ఓడిపోయినట్టే.. ఈ ఏఢాది కూడా ఎలిమినేటర్ మ్యాచ్ లో లేదా.. క్వాలిఫైర్ మ్యాచ్ లో ఓడిపోతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆర్సీబీ(RCB)  అభిమానులు ఈ సారి కాస్త నిరాశలో ఉన్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×