Ex minister Roja: వైసీపీ ఫైర్‌బ్రాండ్, మాజీ మంత్రి రోజా యాక్టివేట్ అయ్యారా? ప్రత్యర్థి వర్గానికి చెక్ పెడుతూ, అధికార పార్టీపై విమర్శలు గుప్పించడం వెనుక ఏం జరుగుతోంది? అందుకోసమే రెచ్చగొట్టి మాట్లాడుతున్నారా? త్వరలో ఆమె అరెస్టు కావడం ఖాయమా? ఈ నేపథ్యంలో దూకుడు ప్రదర్శిస్తున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి. ప్రతీది ప్లాన్ ప్రకారమే చేస్తుంటారు. గడిచిన ఆరు నెలలపాటు సైలెంట్‌గా ఉన్న మాజీ మంత్రి రోజా మళ్లీ యాక్టివేట్ అయినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుటికే ఆడుదాం ఆంధ్రా, టీటీడీ టికెట్లు వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది.
టికెట్లు పేరిట కోట్లాది రూపాయలు బుక్కేశారంటూ టీడీపీ సైతం పదేపదే ప్రస్తావించింది కూడా. దీనిపై కేసు నమోదు తర్వాత, రేపో మాపో ఆమెకి నోటీసులు ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఈ విషయం ముందుగానే తెలిసి, రోజా దూకుడుగా వెళ్తున్నారన్నది కొందరి మాట. శుక్రవారం వైసీపీ పోరుబాట కార్యక్రమంలో కూటమి ప్రభుత్వంపై దూకుడు ప్రదర్శించారామె.
దమ్ముంటే అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? పెట్టండంటూ సవాల్ విసిరారు. కూటమి అరెస్ట్ చేయరని భావించి ఆమె దూకుడుగా వ్యవహరించారని అంటున్నారు. గతంలో టీడీపీ సర్కార్‌పై ఇదే తరహాలో స్కెచ్ వేసిందని, అప్పుడు కొద్దిరోజులపాటు అసెంబ్లీకి దూరమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ALSO READ: జగన్ ప్యాలెస్‌లకు చెక్.. జనవరిలో ముహూర్తం
రెచ్చగొట్టి అరెస్ట్ చేయిస్తే.. సింఫతీ క్రియేట్ అవుతుందని, తద్వారా ప్రజలకు మరింత దగ్గరవచ్చన్నది ఆమె భావన. ప్రస్తుతం రోజా కూడా అదే చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఓసారి మంత్రిగా పని చేశారు. ఓడిపోయిన తర్వాత దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లారు. నగరి నుంచి చెన్నైకి మకాం మార్చేశారు.
పొలిటికల్ యాక్టివిటీ ఉన్నట్లు మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు రోజా. లేదంటే ఎక్స్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఆమెని అణగదొక్కడానికి కొందరు చూస్తున్నారంటూ పలు సందర్భాలుగా చెప్పుకొచ్చారు రోజా. తనకు వ్యతిరేకంగా పెద్దిరెడ్డి మరో వర్గాన్ని ప్రొత్సాహిస్తున్నారనే వాదన రోజా మద్దతు దారుల్లో బలంగా ఉంది.
నగరి వైసీపీలో కీలక అనుచరులంతా పెద్దిరెడ్డి వర్గంవారేనట. ఈ క్రమంలో రోజా చేసిన వ్యాఖ్యలు చిత్తూరు జిల్లా నేతలను టార్గెట్ చేసినట్టు భావిస్తున్నారు. పార్టీ దారుణంగా దెబ్బతినడానికి దిగజారిన రాజకీయాలే కారణమని చెప్పకనే చెప్పారు. ఆమె వ్యాఖ్యలు మాజీ మంత్రిని ఉద్దేశించి చేసినవేనని అంటున్నవాళ్లూ లేకపోలేదు.
రోజా ఆలోచనను దగ్గరుండి గమనించినవాళ్లు మాత్రమే ఒక షార్ట్ టూ బర్డ్స్ ఫార్ములాను ఫాలో అవుతుందని అంటున్నారు. ఎత్తుకు పైఎత్తుల ప్లాన్‌లో ఆమె ఒంటరిగా మిగులుతారా? రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.