Sukumar: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సుకుమార్ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. ఒక కథను ఇలా కూడా చెప్పొచ్చు అని ప్రేమకు ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. కొన్ని సినిమాలు గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది అటువంటి సినిమాల్లో ఆర్య సినిమా ఒకటి. అల్లు అర్జున్ ఈ సినిమా తోనే స్టార్ హీరో అయిపోయాడు. సుకుమార్ రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమా తర్వాత సుక్కు చేసిన సినిమా జగడం. కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేదు కానీ ఇప్పటికీ ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సుకుమార్ వైఫ్ కూడా ఈ సినిమా అంటే ప్రత్యేకమైన ఇష్టం.
రంగస్థలం డెఫ్ క్యారెక్టర్
ఒకప్పుడు కథకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చే దర్శకులు ఉండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో హీరో క్యారెక్టర్ మీద డిపెండ్ అయిపోయిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. అయితే హీరోకి లోపం పెట్టడానికి కొంతమంది దర్శకులు ఆలోచిస్తూ ఉంటారు. కె విశ్వనాథ్ సినిమాల్లో హీరోలకు కొన్ని లోపాలు ఉన్నా కూడా కదా బలాన్ని బట్టి ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించేది. మళ్లీ చాలా ఏళ్లు తర్వాత అలాంటి కథ ఏదైనా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉంది అని అంటే అది రంగస్థలం అని చెప్పాలి. రంగస్థలం సినిమాలో చరణ్ కు డెఫ్ క్యారెక్టర్ పెట్టడానికి ముందు సుకుమార్ కూడా భయపడిపోయారు.
బుచ్చిబాబు చెప్పడం వలనే ముందడుగు
రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్రకు డెఫ్ క్యారెక్టర్ పెడితే అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అని సుకుమార్ ని గట్టిగా కన్విన్స్ చేశాడు బుచ్చిబాబు. మీరు క్యారెక్టర్ ను పట్టుకొని సినిమా చేసి చాలా రోజులైంది మీరు చేయండి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అని చెప్పడంతో సుకుమార్ రంగస్థలం (Rangasthalam) సినిమాలో చిట్టిబాబు క్యారెక్టర్ కు ఆ డిసీజ్ ఆడ్ చేశారు. థియేటర్లో ఇది అద్భుతంగా వర్కౌట్ అయింది. చరణ్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా రంగస్థలం. అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినప్పుడే అన్ని ఇన్పుట్స్ ఇచ్చిన బుచ్చిబాబు (Bucchibabu) ఇప్పుడు చరణ్ తో ఏకంగా దర్శకుడుగా పని చేస్తున్నాడు కాబట్టి ఈసారి నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఇస్తాడు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం ఉంది. దానిని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో కొన్ని రోజుల్లో తెలియనుంది.
Also Read: Sricharan pakala : మ్యూజిక్ డైరెక్టర్ అయిన 12 ఏళ్లకు బ్రేక్ వచ్చింది