BigTV English

Dilraju: తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించనున్న దిల్ రాజు..AI స్టూడియో ప్రారంభం..!

Dilraju: తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టించనున్న దిల్ రాజు..AI స్టూడియో ప్రారంభం..!

Dilraju:తెలుగు సినీ పరిశ్రమలో బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించి, బడా ప్రొడ్యూసర్ గా పేరు సొంతం చేసుకున్నారు దిల్ రాజు(Dilraju). ఇప్పుడు ఈయన తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఒక కొత్త ట్రెండ్ మొదలు పెట్టబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించి ఇప్పటివరకు ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసి.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈయన, ఈసారి ఏకంగా ఒక కొత్త టెక్నాలజీ సంస్థను ప్రారంభించడానికి రంగంలోకి దిగారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో అందరికంటే ముందుగానే ఒక అడుగు ముందుకు వేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ స్థాయి మేధస్సుతో పనిచేస్తున్న క్వాంటం ఏఐ గ్లోబల్ అనే సంస్థతో దిల్ రాజు చేతులు కలిపి ఈ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.


ఏ ఐ స్టూడియో నిర్మాణానికి సర్వం సిద్ధం..

దిల్ రాజు చేపట్టనున్న ఈ కొత్త ప్రయోగం మొత్తం పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే ఉండబోతోంది. ముఖ్యంగా సినిమా రంగం కోసం ప్రత్యేకంగా రూపొందించే టూల్స్ ను అభివృద్ధి చేయాలనే దిశగా దిల్ రాజు ఆలోచిస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఇక్కడ సినిమా ప్రీ ప్రొడక్షన్ మొదలు పోస్ట్ ప్రొడక్షన్ వరకూ డబ్బింగ్, వీఎఫ్ఎక్స్, ఎడిటింగ్, విజువల్స్ వంటి విభాగాలలో కూడా అత్యాధునిక టెక్నాలజీతో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నమే ఇది అని చెప్పవచ్చు. ఈ మేరకు ఈ ప్రతిష్టాత్మక ఎకో సిస్టమ్ ను ” AI స్టూడియో” పేరుతో ప్రారంభించబోతున్నారు. మే 4వ తేదీన ఈ సంస్థను అధికారికంగా టాలీవుడ్ లో ప్రారంభించబోతున్నట్లు దిల్ రాజు స్వయంగా ప్రకటించడం జరిగింది. “లైట్స్.. కెమెరా.. ఇంటెలిజెన్స్..” అనే క్యాప్షన్ తో తాజాగా దిల్ రాజు పోస్టర్ రిలీజ్ చేయగా… ఇది సినిమాల్లో టెక్నాలజీ వినియోగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతోంది అంటూ అంచనాలు పెంచేశారు. ఇప్పటివరకు మనం చూసిన ట్రెడిషనల్ మూవీ మేకింగ్ పద్ధతులను ఈ ఏఐ ఇప్పుడు పూర్తిగా మార్చబోతోంది అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అంతేకాదు ఈ కొత్త ప్రయత్నం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలియజేసేలా దిల్ రాజు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియోలో 1913లో మొదలైన మొదటి సినిమాతో భారతదేశం వెండితెరతో ప్రేమలో పడిందని గుర్తు చేస్తూ.. ప్రస్తుతం 2025లో ఆ ప్రేమను ఇంటలిజెన్స్ తో కలిపి మరో ప్రయోగానికి నాంది పలుకుతున్నామంటూ తెలిపారు. మొత్తానికి అయితే తెలుగు సినీ పరిశ్రమలో ఏఐ స్టూడియోని ఏర్పాటు చేస్తూ ఇకపై భవిష్యత్తులో సినిమా భవిష్యత్తునే మార్చేయబోతున్నారు దిల్ రాజు అని చెప్పవచ్చు.


కృష్ణ తర్వాత ఆ చొరవ తీసుకుంటున్న ప్రొడ్యూసర్ ఈయనే..

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీలను పరిచయం చేయడంలో దివంగత నటులు సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ముందుండే వారు. ఇప్పుడు ఆయన తర్వాత దిల్ రాజు ఆ చొరవ తీసుకొని తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచస్థాయిలో గుర్తింపు అందించేలా తన వంతు కృషి చేయడంపై ఆయనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఏఐ స్టూడియో ఆధారితంగా రూపొందించే సినిమాలు సినీ లవర్స్ కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ను అందిస్తాయో చూడాలి.

Khushbu Sundar: మీ లోపల అంతా మురికే.. నెటిజన్ ప్రశ్నకు ఖుష్బూ ఘాటు రిప్లై..!

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×