BigTV English

Dil Raju: ఇది యాపారం.. దిల్ రాజు ‘దసరా’ మాస్ట‌ర్ ప్లాన్‌

Dil Raju: ఇది యాపారం.. దిల్ రాజు ‘దసరా’ మాస్ట‌ర్ ప్లాన్‌

Dil Raju:టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్‌లో ఒక‌రైన దిల్ రాజు వేసే ప్రతీ అడుగుని ఆచి తూచి వేయ‌ట‌మే కాదు.. ఇత‌రులు ఊహించ‌ని రీతిలో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయ‌న మాస్ట‌ర్ మైండ్‌ను నాని హీరోగా చేస్తోన్న ద‌స‌రా సినిమా విష‌యంలో చూపించుకున్నారు. దిల్ రాజు స్కెచ్ చూసి ఇత‌ర నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్స్ షాక్ అవుతున్నారు. అస‌లు ఏం జ‌రిగింది? దిల్ రాజు వేసిన స్కెచ్ ఏంటి? అనే వివ‌రాల్లోకి వెళితే… నేచుర‌ల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ద‌స‌రా. ఇది పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది. మార్చి 30న మూవీ రిలీజ్‌కు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.


ద‌స‌రా సినిమాను సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. సినిమా రిలీజ్ కాక ముందే థియేట్రిక‌ల్ రైట్స్ విష‌యంలో పెద్ద పోటీని నెల‌కొంది. అయితే నిర్మాత ద‌గ్గ‌ర నుంచి చ‌ద‌ల‌వాడ శ్రీనివాస్ స‌హా కొంద‌రు వివిధ ఏరియాల థియేట్రిక‌ల్ రైట్స్‌ను కోట్లు ఖ‌ర్చు పెట్టి కొనేశారు. అయితే ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ త‌ర్వాత దిల్ రాజుకి ద‌స‌రా సినిమాపై కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. వెంట‌నే ఆయ‌న రంగంలోకి దిగి ఇత‌ర డిస్ట్రిబ్యూట‌ర్స్ ద‌గ్గ‌రున్న థియేట్రిక‌ల్ రేట్స్‌ను ఎక్కువ ధ‌ర‌కు కొనుగోలు చేశాడు. ఉదాహ‌ర‌ణ‌కు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస్‌కు అయితే ఆయ‌న కొన్న‌దాని కంటే నాలుగు కోట్ల రూపాయ‌లు ఎక్కువ‌గా ఇచ్చి హ‌క్కుల‌ను త‌న‌కు ద‌క్కేలా చేసుకున్నాడ‌ట దిల్ రాజు.

దిల్ రాజుని దాటి సినిమాను రిలీజ్ చేయలేం. ఎందుకంటే ఆయ‌న ద‌గ్గ‌ర థియేట‌ర్స్ ఉన్నాయి. దీంతో చ‌ద‌ల‌వాడ కూడా అనుకున్న దాని కంటే ఎక్కువ మొత్తం రావ‌టంతో రైట్స్ దిల్ రాజుకి ఇచ్చేశాట్ట‌. ఇప్పుడు దిల్ రాజు తాను కొన్న థియేట్రిక‌ల్ రేట్స్‌ను ఇత‌రుల‌కు ఎక్కువ మొత్తంలో అమ్ముతున్నాడ‌ట‌. ద‌స‌రా సినిమాపై ఉన్న అంచ‌నాల‌తో ఇత‌ర ప్రాంతాల డిస్ట్రిబ్యూట‌ర్స్ భారీ మొత్తాన్ని దిల్ రాజుకి చెల్లించి హ‌క్కుల‌ను ద‌క్కించుకున్నాట‌. ఇది యాపారం.. ఇలాంటి గేమ్స్ ఆడాల్సిందేన‌ని నైజాం థియేట‌ర్స్ కింగ్‌ను చూసి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×