Allu Arjun: అల్లు అర్జున్ (Allu Arjun).. ప్రస్తుతం ఈయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప(Pushpa ) సినిమా తర్వాత పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన ఈయన పుష్ప 2 (Pushpa 2) తో ఇంటర్నేషనల్ లెవెల్ లో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బన్నీ తనకున్న రేంజ్ ను దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) తో భారీ బడ్జెట్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అట్లీతో సినిమా పూర్తయిన వెంటనే ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)తో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తో ఒక సినిమా అలాగే ‘పుష్ప 3’ సినిమాలు లైన్లో ఉన్నాయి. అయితే ఇవన్నీ ఇంతటి బిజీ షెడ్యూల్ లో ఉండగా ఇప్పుడు బన్నీకి సంబంధించిన మరో వార్త తెరపైకి వచ్చింది.
ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించిన దిల్ రాజు..
అసలు విషయంలోకి వెళ్తే.. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అల్లు అర్జున్ – సుకుమార్(Sukumar ) కాంబినేషన్లో తొలిసారి వచ్చిన చిత్రం ‘ఆర్య’. ఈ సినిమా అటు అల్లు అర్జున్ ఇటు సుకుమార్ జీవితాలనే మార్చేసింది. అప్పటినుంచి వీరి మధ్య అనుబంధం కూడా ఏర్పడింది. ఆర్య కూడా మంచి క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచిపోయింది. దానికి సీక్వెల్ గా వచ్చిన ఆర్య 2 పర్వాలేదు అనిపించుకుంది. గత సంవత్సరం ఆర్య 20 ఏళ్ల వేడుక కూడా ఘనంగా చేశారు. అయితే ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. దిల్ రాజు (Dilraju) ఆర్య 3 టైటిల్ ని రిజిస్టర్ చేయించారట. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై ఆర్య 3 టైటిల్ రిజిస్టర్ చేయించారని సమాచారం. అంతేకాదు ఒక సీనియర్ పి ఆర్ ఓ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇక ఈ విషయం తెలిసి బన్నీ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బన్నీ బిజీగా ఉన్న బన్నీ ఇలాంటి సమయంలో లవ్ స్టోరీ చేస్తారా ? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాదు సుకుమార్ పుష్ప3 కాకుండా ఆర్య 3 చేస్తాడా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
తెరపైకి ఆశిష్ రెడ్డి..
అయితే ఇలా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో తెరపై మరో కొత్త వార్త వినిపిస్తోంది. సుకుమార్ పర్యవేక్షణలో వేరే డైరెక్టర్ తో ఇంకో హీరోతో ఈ సినిమా తీస్తారేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు దిల్ రాజు అన్న కొడుకు ఆశీష్ రెడ్డి (Ashish Reddy) ఈ సినిమాకు హీరోగా చేస్తారేమో అని కూడా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమాను ఎవరి పర్యవేక్షణలో ఎవరు చేస్తారు? అసలు ఏం జరుగుతోంది అనే టెన్షన్ అభిమానులలో మొదలైంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ రావాలి అంటే దిల్ రాజు స్పందించాల్సిందే.
ALSO READ:Shiva Jyothi: నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసిన యాంకర్ శివజ్యోతి.. ఏమైందంటే..?