BigTV English

Sreemukhi : శ్రీముఖిని పుల్లతో పోలుస్తూ.. అడ్డంగా పరువు తీసిన కమెడీయన్..

Sreemukhi : శ్రీముఖిని పుల్లతో పోలుస్తూ.. అడ్డంగా పరువు తీసిన కమెడీయన్..

Sreemukhi : బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఈమె బుల్లితెరపై చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఏ షో చేసిన కూడా ఆ షోలో ఈమెకు ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. అలాగే ప్రస్తుతం సుమ తర్వాత టాప్ లో కొనసాగుతున్న యాంకర్ అంటే శ్రీముఖి పేరే వినిపిస్తుంది.. ఎన్నో టీవీ షోలలో యాంకర్ గా చేస్తూ బిజీగా ఉంది శ్రీముఖి. ప్రస్తుతం ఓ షోలో ఆమెకు అవమానం జరిగిందంటూ ఓ వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. షో జరుగుతున్నప్పుడు కమెడియన్ ఆమెను దారుణంగా అవమానించాడంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు రచ్చ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది?.. శ్రీముఖి ని ఎవరేమన్నారు? ఇప్పుడు మనం తెలుసుకుందాం..


శ్రీముఖి పరువు తీసిన కమెడీయన్..

ప్రముఖ తెలుగు ఛానెల్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటుగా టీఆర్పీ రేటింగ్ ను పెంచుకుంటూ వస్తుంది. కొత్త షోలు చెయ్యడంలో స్టార్ మా తర్వాతే ఎవరైన.. అయితే ఈ ఛానెల్ లో కిర్రాక్ బాయ్స్.. కిలాడీ గర్ల్స్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ షోలో విలేజ్ టీం తో ఎపిసోడ్ జరగనుంది అని తెలుస్తుంది. అయితే పల్లెటూరు వాతావరణం ని క్రియేట్ చేస్తూ ఐస్ ని కూడా అందులో తీసుకొచ్చారు. జబర్దస్త్ కమెడియన్ యాదమరాజు పుల్ల ఐస్ ను అమ్ముతూ అక్కడికి వస్తాడు.. అందరూ ఎవరికి కావాల్సిన ఐస్ క్రీములను వాళ్ళు తీసుకుంటారు. అయితే శ్రీముఖి నాకు పుల్ల ఐస్ క్రీం కావాలి అని అరుస్తుంది. దానికి యాదమరాజు నీకు కావాల్సింది అదే అని నాకు తెలుసు అందుకే తీసుకొచ్చాను అని అంటాడు. నాకు అదే కావాలని నీకు తెలుసు రా అని శ్రీముఖి అడిగితే.. నువ్వు అందరికి పుల్లలు పెట్టి విడగొడతావు కదా అందుకే అని పరువు తీస్తాడు.. అక్కడ ఉన్న వాళ్లు ఆ మాట వినగానే నవ్వుతారు.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో శ్రీముఖి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..


Also Read :తస్సాదియ్యా.. పైసా వసూల్ అంటున్న బాలయ్య..

కిర్రాక్ బాయ్స్.. కిలాడీ గర్ల్స్ సీజన్ 2.. 

గతంలో ఈ షో మొదటి సీజన్ ప్రసారం అయ్యింది. ఆ షో అనుకున్న దానికన్నా ఎక్కువగా హిట్ అవ్వడంతో.. ఇప్పుడుకిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సీజన్ 2 రసవత్తరంగా సాగుతోంది. రీలోడెడ్ అంటూ ఇటీవలే మరో ఆరుగుర్ని షోలోకి దించారు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్‌లో షో నుంచి ఇద్దరిని ఎలిమినేట్ చేశారు.. ప్రస్తుతం ఈమె కిరాక్ బాయ్స్.. కిలాడి గర్ల్స్ అనే షోకు హోస్ట్ గా శ్రీముఖి చేస్తుంది. ఈ షోలో ఒక్క వారం ఒక్కో థిమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా ఈవారం ప్రసారం కాబోతున్న షో కి సంబంధించిన ప్రోమోలో విలేజ్ థిమ్ చెయ్యనున్నట్లు అర్థమవుతుంది.. ప్రస్తుతం విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్ ఎంత ఫన్ గా ఉంటుందో అర్థం అవుతుంది. అందుకే ఆ ఎపిసోడ్ ని అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి..

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×