DilRaju’s reaction to RakeshVarre’s Comments : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో నాగచైతన్య హీరోగా పరిచయమైన సినిమా జోష్. ఈ సినిమాతోనే వాసు వర్మ కూడా దర్శకుడుగా పరిచయం అయ్యాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఇప్పటికీ ఈ సినిమాకి మంచి కల్ట్ స్టేటస్ ఉంది. ఈ సినిమాతో చాలామంది యంగ్ యాక్టర్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రచయితగా నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకున్న సిద్దు జొన్నలగడ్డ కూడా ఈ సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు. అలానే ఈ సినిమాలో రాకేష్ వర్రే కూడా ఒక కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన రాకేష్ ఎవరికీ చెప్పొద్దు (Evariki Cheppodhhu) సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది.
ఇక రీసెంట్ గా పేక మేడలు (Peka Medalu) ఒక సినిమాను నిర్మించాడు. ఈ సినిమాను చూసిన కొంతమంది మాత్రం బాగా నచ్చింది అని తమ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు. అయితే ఈ సినిమా పూర్తిస్థాయిలో ప్రేక్షకులు ముందుకు వెళ్లలేదు. ఇక రీసెంట్ జితేందర్ రెడ్డి అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు రాకేష్. ఈ సినిమాకి విరించి వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఈవెంట్ లో రాకేష్ మాట్లాడుతూ నేను సెలబ్రిటీలు చాలామందికి మెసేజ్ పెట్టాను. ఒక్క సెలబ్రిటీ కూడా సినిమాను ఎంకరేజ్ చేయడానికి రాలేదు అంటూ వాపోయాడు. నేను పనిచేసిన వాళ్ళందరికీ మెసేజ్ పెట్టాను అని రాకేష్ ఆ స్పీచ్ లో ఆవేదనను వ్యక్తం చేశాడు.
Also Read : Telugu Directors: డైరెక్టర్స్ కొత్త ఫార్ములా.. ముందు బ్లాక్ బస్టర్ కొట్టాలి, ఆ తరువాత గుండు కొట్టించుకోవాలి
ఇక తాజాగా కిరణ్ అబ్బవరం నటించిన క సినిమా సక్సెస్ మీట్ జరిగింది. ఈ సక్సెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ..”మొన్న రాకేష్ సెలబ్రిటీలు ఎవరూ రావడం లేదు అని తన స్పీచ్ లో చెప్పాడు. సెలబ్రిటీస్ ఎవరు రారమ్మా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. మీడియా మిత్రులకు సెలబ్రిటీస్ కావాలి. సెలబ్రిటీస్ వస్తే వాళ్ల క్లిక్స్ వాళ్లకి వస్తాయి. ఇక్కడ సెలబ్రిటీలు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. ఫైనల్ గా నీ సినిమా కంటెంట్ మాత్రమే ఇక్కడ మాట్లాడాలి అంటూ తెలిపారు. అయితే రాకేష్ స్పీచ్ ప్రకారం పని చేసిన వాళ్లు అంటే, దిల్ రాజు నిర్మించిన జోష్ సినిమా తోనే పరిచయమయ్యాడు రాకేష్. ఒకవేళ దిల్ రాజుకి కూడా రాకేష్ మెసేజ్ చేసి ఉండొచ్చు. అలానే దిల్ రాజ్ కూడా తన పనిలో బిజీగా ఉండొచ్చు. బహుశా అందుకే ఇప్పుడు ఆన్ స్టేజ్ పైన సమాధానమిచ్చారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.