Telugu Directors: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్ రాజమౌళి చేసిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూడటం మొదలుపెట్టారు. ఇంకా త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తెలుగు సినిమా స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత వచ్చిన పుష్ప సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రీసెంట్ గా వచ్చిన కల్కి (Kalki) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకప్పుడు తెలుగులో 100 కోట్ల సినిమా రావడమే గగనంలా అనిపించేది. ఇప్పుడు ఏకంగా తెలుగు సినిమా 1000 కోట్ల వైపు పరుగులు పెడుతుంది. ఇప్పటికే బాహుబలి (Bahubali) సినిమాకు 1000 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అలానే ట్రిపుల్ ఆర్ సినిమా కూడా అదే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ప్రస్తుతం తెలుగు డైరెక్టర్స్ తీసే సినిమాలు పై బీభత్సమైన అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి (Sandeep Reddy vanga), నాగ్ అశ్విన్ (Nag Ashwin) వీరిద్దరూ వెయ్యి కోట్లు సినిమాలు చేసేసారు. యాదృచ్ఛికంగా వీరిద్దరికీ లాంగ్ హెయిర్ ఉండేది. బహుశా వెయ్యి కోట్లు సినిమా చేసిన తర్వాత తలనీలు అర్పిస్తానని మాట ఇచ్చారు ఏమో, 1000 కోట్లు సినిమా కొట్టిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్లి గుండు కొట్టించుకున్నారు. ఇక రీసెంట్ గా యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా తన పంథాను మార్చి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే వరుసగా సార్ (Sir), లక్కీ భాస్కర్ (Lucky Bhasker) సినిమాలతో వరుస హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు వెంకీ గుండు కొట్టించుకున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More : Suriya: నేను సిగ్గులేకుండా చెప్తున్నాను.. సూర్య సంచలన వ్యాఖ్యలు
ఇక సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించి రెండవ సినిమాకే బాలీవుడ్ లో పనిచేసే అవకాశాన్ని తెచ్చి పెట్టింది. రన్బీర్ కపూర్ హీరోగా చేసిన అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక పెను సంచలనం అని చెప్పాలి. దాదాపు మూడు గంటలకు పైగా ఉన్న ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సందీప్ దర్శకత్వం వహించిన మూడవ సినిమా ఇది.
ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన నాగి మహానటి సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. తన కెరీర్ లో మూడవ సినిమాగా చేసింది కల్కి. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వంటి ఎంతో పెద్ద స్టార్ కాస్ట్ నటించిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తో అద్భుతమైన కలెక్షన్స్ ను వసూలు చేసింది. ఈ సినిమాకి సీక్వెల్ కూడా రానుంది. ఈ సినిమాకు ఓటీటీలో కూడా మంచి ఆదరణ లభించింది.