Weight Gain Tips: బరువు తగ్గడం మాత్రమే సమస్య కాదు. బరువు పెరగడం కూడా పెద్ద సవాల్ అనే చెప్పాలి. చాలా మంది బరువు పెరగడం లేదని ఆందోళన చెందుతుంటారు. బరువు పెరగడం కోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించదు. అలాంటి వారికి కొన్ని రకాల టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మరి బరువు పెరగడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ రకాల కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు లేదా గింజలను కలపడం ద్వారా అనేక రకాల స్మూతీలను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో ప్రొటీన్లు, ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు పెరగడానికి సహాయపడతాయి. ఇవి ఆరోగ్యకరమైనవి అంతే కాకుండా బరువు పెరగడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి. ఈ స్మూతీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. పీనట్ బటర్ బనానా స్మూతీ:
కావాల్సినవి:
అరటి పండు- 1
వెన్న- 2 టేబుల్ స్పూన్లు
కొవ్వు పాలు-1 కప్పు
తేనె-1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: ఈ పదార్థాలన్నింటినీ బ్లెండర్‌లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ స్మూతీలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి, ఇవి బరువు పెరగడానికి సహాయపడతాయి.
2. అవోకాడో చాక్లెట్ స్మూతీ:
కావాల్సినవి:
అవకాడో-1
పాలు లేదా కొబ్బరి పాలు- 1
కోకో పౌడర్- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం: అన్ని పదార్థాలను బ్లెండర్లో వేసి మిక్స్ చేయండి. ఈ స్మూతీలో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి బరువు పెరగడంలో సహాయపడతాయి.
3. బెర్రీ, కొబ్బరి స్మూతీ:
కావలసినవి:
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు-1/2 కప్పు
కొబ్బరి పాలు-1 కప్పు
చియా విత్తనాలు- 1 టేబుల్ స్పూన్
పెరుగు- 1/4 కప్పు
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో అన్ని పదార్థాలను బ్లెండర్లో వేసి మిక్స్ చేయండి. బెర్రీలు, కొబ్బరి కలిపి తయారు చేసిన ఈ స్మూతీ యాంటీఆక్సిడెంట్లు, కేలరీలుసమృద్ధిగా ఉంటాయి.
4. ఓట్స్ ప్రోటీన్ స్మూతీ:
కావలసినవి:
ఓట్స్- 1/2 కప్పు
ప్రోటీన్ పౌడర్ – 1 స్పూన్
అరటిపండు- 1
పాలు- 1 కప్పు
డ్రై ఫ్రూట్స్- చిన్న కప్పు
Also Read: చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండిలా !
తయారీ విధానం:
అన్ని పదార్థాలను బ్లెండర్లో వేసి మిక్స్ చేయాలి. స్మూతీ తయారవుతుంది. ఈ స్మూతీలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది.