BigTV English

Anil Ravipudi: క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్లకండయ్యా.. పాపం బిడ్డను బాగా భయపెట్టినట్టున్నారుగా

Anil Ravipudi: క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్లకండయ్యా.. పాపం బిడ్డను బాగా భయపెట్టినట్టున్నారుగా

Anil Ravipudi: కాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు.. కానీ, నోరు జారితే మాత్రం వెనక్కి తీసుకోలేరు అనేది పెద్దలు చెప్పిన ఒక సామెత. కొన్నిసార్లు.. కొన్ని సంఘటనల వలన ఈ సామెత నిజమే అనిపిస్తున్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మీడియా ముందు సెలబ్రిటీలు నోరు జారకూడదు.


ఒకప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి.. నోరు జారినా పర్లేదు అనుకోవచ్చు. కానీ, ఇప్పుడు అలా కాదు. ఒక్క మాట స్టేజిమీద నోరుజారీ కిందకు వచ్చేలోపు సోషల్ మీడియాలో ట్రోల్స్ రచ్చ మొదలవుతుంది. ఆ తరువాత లాక్కోలేక.. పీక్కోలేక చావాలి. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి పరిస్థితి అలానే ఉంది. అనుకోకుండా స్టేజిమీద నోరుజారి ఒక మాట అని ట్రోల్స్ బారిన పడ్డాడు. కొన్నిరోజుల క్రితం సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళితో పాటు అనిల్ రావిపూడి కూడా గెస్ట్ గా విచ్చేశాడు.

ఇక స్టేజిమీద ఆయన మాట్లాడుతూ.. “ఐపీఎల్ మ్యాచ్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు.. సాయంత్రాలు సినిమాలకు రండి. కావాలంటే ఐపీఎల్ స్కోర్స్ ను ఆన్లైన్లో చూసుకోవచ్చు” అన్నాడు. ఈఒక్క మాట.. అనిల్ ను సోషల్ మీడియా ట్రోల్స్ కు స్టఫ్ గా మార్చేశాయి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, క్రికెట్ లొవర్స్ తో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు అని అనిల్ కు ఫ్యాన్స్ చుక్కలు చూపించారు.


ఇక ఆ తరువాత అనిల్ సైతం ఓరి బాబో నేను వేరేలా అనలేదు.. ఐపీఎల్ చూడండి..ఇటు సినిమాలు చూడండి. నేను ఐపీఎల్ చూస్తాను.. నేను మాట్లాడింది తప్పుగా అపార్థం చేసుకోవద్దు అంటూ చెప్పుకొచ్చినా ఫ్యాన్స్ వినలేదు. అలా అనిల్ ను భయపెట్టారు. తాజాగా ఢీ షో ఫైనల్ కు వచ్చిన అనిల్ కు హైపర్ ఆది మరోసారి ఈ ఐపీఎల్ కామెంట్స్ గుర్తుచేసి రచ్చ చేశాడు.

హైపర్ ఆది మాటలకు అనిల్ సమాధానమిస్తూ.. ” ఆపవయ్యా.. ఆపు.. బ్యాటింగ్ మాములుగా లేదక్కడ.. క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్లకండయ్యా.. ఫ్రీ టైమ్ లో ఏదో ఒకటి చూసుకుంటారు.. చాలా సెన్సిటివ్ గా ఉన్నారు వాళ్లు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాటలు విన్నాకా నెటిజన్స్.. పాపం బిడ్డను బాగా భయపెట్టినట్టున్నారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×