Allu Arjun: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అట్లీ(Atlee) తాజాగా గౌరవ డాక్టరేట్ (Doctorate)అందుకున్నారు. చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ(Satyabhama University) నుంచి ఈయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు దర్శకుడు అట్లీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సత్యభామ యూనివర్సిటీలో నేడు 35వ కాన్వకేషన్ ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఈయనకు డాక్టరేట్ అందజేశారు.
అపజయం ఎరుగని దర్శకుడు…
కళా రంగానికి అట్లీ అందిస్తున్న సేవలను గుర్తించిన యూనివర్సిటీ ఈయనకు డాక్టర్ ప్రధానం చేసింది. ఈయన రాజా రాణి అనే సినిమా ద్వారా దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న అట్లీ అనంతరం తెరి, మెర్సల్, బిగిల్ వంటి వరుస తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇప్పటివరకు ఒక అపజయం కూడా ఎరుగని దర్శకుడిగా అట్లీ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ఈయన కేవలం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా ఇటీవల బాలీవుడ్ సినిమాకి కూడా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో షారుఖ్ తో జవాన్ సినిమా సినిమా చేయగా ఇది కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
సత్యభామ యూనివర్సిటీ..
ఇక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అట్లీ తన తదుపరి సినిమాని పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun) తో చేసే అవకాశాన్ని అందుకున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా ఇండస్ట్రీకి ఈయన అందిస్తున్న సేవలను గుర్తించిన సత్యభామ యూనివర్సిటీ తనకు గౌరవ డాక్టరేటను ప్రధానం చేసింది. ఈ డాక్టరేట్ అందుకున్న తర్వాత అట్లీ మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాను సినిమాల రూపంలో తెరపై చూపిస్తున్నది మొత్తం తన నిజ జీవితంలో జరిగిన సంఘటనలేనని తెలిపారు.
Big congratulations to @Atlee_dir garu on receiving the honorary doctorate. Really happy to see your passion and craft being celebrated at this level. Wishing you many more heights ahead 🖤 pic.twitter.com/1vPsSd0LOu
— Allu Arjun (@alluarjun) June 14, 2025
ఇలా ఈయన డాక్టరేట్ అందుకోవడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. “గౌరవ డాక్టరేట్ అందుకున్న అట్లీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అభిరుచి ,నైపుణ్యాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలి” అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బన్నీ ఫాన్స్ కూడా డైరెక్టర్ అట్లీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా దీపిక పదుకొనే నటిస్తున్న విషయం తెలిసిందే.