BigTV English

Director Bala: దయచేసి నన్ను విషయం అడక్కండి, కట్ చేయండి

Director Bala: దయచేసి నన్ను విషయం అడక్కండి, కట్ చేయండి

Director Bala: కేవలం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ బాలాకు ఎంత క్రేజీ ఉంది అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బాలా తీసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాల ఒక సంచలనం అని చెప్పాలి. 1999లో సేతు అనే సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు బాల. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత బాలా తీసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా మారాయి. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో బాల అంటే ఒక బ్రాండ్ అని చెప్పాలి. చాలామంది దర్శకులకు బాల ఒక ఇన్స్పిరేషన్. అటువంటి బాల తెలుగు అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేస్తున్నాడు అని తెలిసినప్పుడు చాలామంది విపరీతమైన విమర్శలు చేశారు. అర్జున్ రెడ్డి గొప్ప సినిమా. కానీ బాల రీమేక్ చేయాల్సినంత గొప్ప సినిమా కాదు అనేది చాలామంది అభిప్రాయం. ఈ సినిమాను వర్మ అనే పేరుతో రీమేక్ చేశాడు బాలా.


అయితే ఈ సినిమా విషయంలో బాల చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ అవుతోంది అనుకున్న కూడా ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. మళ్లీ ఇదే సినిమాను ఆదిత్య వర్మ పేరుతో సందీప్ రెడ్డి వంగ అసిస్టెంట్ డైరెక్టర్ గిరీశయ్య రీమేక్ చేశాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఒకరకంగా సక్సెస్ సాధించింది. ముఖ్యంగా ధ్రువ్ విక్రమ్ కి మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడు అని మొదటి సినిమాతోనే పేరు సాధించుకున్నాడు ధృవ్ విక్రమ్. మొత్తానికి బాలా తీసిన వర్మ వెర్షన్ కూడా ఓటీటీ లో విడుదల అయింది. అయితే బాలా ఏంటి ఈ సినిమాను ఇలా తీశాడు అని చాలామంది విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

మొత్తానికి అర్జున్ రెడ్డి కి సంబంధించిన వివాదం అయిపోయింది అనుకునే టైంలో, మరోసారి ఆ ప్రస్తావన మళ్ళీ మొదలైంది. ప్రస్తుతం బాల అరుణ్ విజయ్ హీరోగా వనంగాన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా జనవరి 10న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంలో ఈ సినిమాకు సంబంధించిన పలు రకాల ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నాడు బాల. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాలాను అర్జున్ రెడ్డి సినిమా గురించి అడిగాడు ఒక యాంకర్. దీనికి బాల మాట్లాడుతూ సైలెంట్ గా కట్ చేయండి అని సిగ్నల్ ఇచ్చాడు. కనీసం అర్జున్ రెడ్డి సినిమా గురించి ఒక మాట కూడా మాట్లాడకుండా అసహనం వ్యక్తం చేశాడు దర్శకుడు బాల. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Also Read : Sankranthiki Vasthunnam : వెంకీమామ నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×