China High Speed Railway: రైల్వే ప్రయాణీకుల భద్రతకు ముప్పు కలిగేలా వ్యవహరించిందనే కారణంతో చైనా పోలీసులు ఓ మహిళా ప్రయాణీకురాలిని అదుపులోకి తీసుకున్నారు. షెన్ జెన్ లో ఒక మహిళా ప్యాసింజర్ హైస్పీడ్ రైలు డోర్లు క్లోజ్ కాకుండా మధ్యలో నిలబడి బలవంతంగా అడ్డుకుంది. ఆమె సహచరులు ఎక్కే వరకు అలాగే చేసింది. రైల్వే ఆపరేషన్ ను అడ్డుకోవడం ద్వారా ప్రజా భద్రతా నిబంధనలను ఉల్లంఘించిందనే కారణంతో ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని CCTV వెల్లడించింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
CCTV న్యూస్ ప్రకారం.. మధ్యాహ్నం సమయంలో షెన్ జెన్ నార్త్ రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన జరిగింది. వు అనే మహిళ హైస్పీడ్ రైలు డోర్లు క్లోజ్ కాకుండా అడ్డుకుని, రైలు బయల్దేరకుండా అడ్డుకుంది. ఇద్దరు రైల్వే సిబ్బంది ఆమెను అలా చేయకూడదని వారించినప్పటికీ, వారి హెచ్చరికలను పట్టించుకోలేదని CCTV న్యూస్ వెల్లడించింది. వు ఐదురుగు వ్యక్తులతో కలిసి రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టింది. టికెట్ చెకింగ్స్ తర్వాత ఆమె, ఆమె కుమార్తె రైలు ఎక్కారు. కానీ, ఆమెతో పాటు వచ్చిన మిగతా ముగ్గురు వ్యక్తులు పొరపాటున ఎదురుగా ఉన్న ప్లాట్ ఫారమ్ లో వేరే రైలు ఎక్కారు.
తోటి వారి కోసం రైలు వెళ్లకుండా ఆపే ప్రయత్నం
వు ఎక్కిన రైలు బయలుదేరే సమయం ఆసన్నమైంది. ముగ్గురు కుటుంబ సభ్యులు ఇంకా ఎక్కకపోవడంతో.. రైలును ఆలస్యం చేయడానికి వు ట్రైన్ డోర్ మధ్యలో నిలబడి క్లోజ్ కాకుండా అడ్డుకుంది. ఆమెతో పాటు ఉన్న మిగతా ముగ్గురు వ్యక్తులు రైలు ఎక్కిన తర్వాతే, ఆమె డోర్ నుంచి దూరంగా జరిగింది. ఆ తర్వాత డోర్లు క్లోజ్ కావడంతో రైలు బయల్దేరింది.
Read Also: హైదరాబాద్ మెట్రో కొత్త రూట్స్, రాబోయే స్టేషన్లు ఇవే.. మీ ఏరియా ఉందేమో చూడండి!
రైల్వే భద్రత విషయంలో చైనా కఠిన చర్యలు
ఇక ఈ ఘటన జరిగిన మరుసటి రోజులు పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. షెన్ జెన్ రైల్వే పోలీసులు తూర్పు చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్ లోని జియామెన్ లో వును గుర్తించారు. దర్యాప్తు కోసం ఆమెను షెన్ జెన్ కు తీసుకొచ్చారు. ఈ ఘటన ఈ నెల18న జరిగగా సదరు మహిళను 19న అదుపులోకి తీసుకున్నారు. 20న అధికారిక ప్రకటన విడుదల చేశారు. హైస్పీడ్ రైలు డోర్లు క్లోజ్ కాకుండా వు అడ్డుకోవడం రైల్వే ఆపరేషన్స్ కు ఆటంకం కలిగించేలా ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. ఆమె ప్రజా రవాణా భద్రతకు విఘాతం కలిగించిన కారణంగా అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె రైల్వే పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఆమెను కోర్టు ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. రైల్వే ఆపరేషన్స్ కు ఎవరు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Read Also: హైదరాబాద్ మెట్రో.. సరికొత్త యాప్, ఇది ఎలా పనిచేస్తుందంటే?