IndraGanti Mohan Krishna : ప్రతి దర్శకుడు కి ఒక్కో శైలి ఉంటుంది. ఒకరు చేసిన విధంగా మరొకరు సినిమాలు చేయలేరు. ఎవరి స్టైల్ వారిది ఎవరి పంథా వారిది. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఒక రకమైన ఫిలిం మేకర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి చూసేలా డిఫరెంట్ కాన్సెప్ట్ ని తెరకెక్కించడం ఇంద్రగంటి మోహన్ కృష్ణ స్టైల్. ఇప్పటివరకు ఇంద్రగంటి మోహన్ కృష్ణ చేసిన సినిమాలన్నీ ఎక్కువ శాతం పుస్తకాలనుండి ప్రేరణ పొందినవే. ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలు కూడా ఒక మంచి పుస్తకం చదివిన అనుభూతిని కలిగిస్తాయి అనడంలో సందేహం లేదు. తీసినవి కొన్ని సినిమాలు అయినా వాటిలో చాలామందికి ఎక్కువ శాతం ఫేవరెట్ ఫిలిమ్స్ ఉంటాయి. ఎందుకంటే మోహన్ కృష్ణ రైటింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు.
గ్రహణం సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. ఆ తర్వాత మాయాబజార్ అనే సినిమాను చేశారు. ఆ తర్వాత చేసిన అష్టాచమ్మా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతోనే నాని యాక్టర్ గా పరిచయమయ్యాడు. నేడు నాని (Nani) పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పటికీ ఇంద్రగంటి మోహన్ కృష్ణతో నానికి అదే రిలేషన్షిప్ ఉంటుంది. అష్ట చమ్మా తర్వాత సినిమా గోల్కొండ హై స్కూల్. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమంత్ కెరియర్ లో ఉన్న అతి తక్కువ హిట్ సినిమాలలో ఈ గోల్కొండ హై స్కూల్ కూడా ఉంటుంది. ఒక పుస్తకం నుంచి ప్రేరణగా తీసుకొని తీసిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణను తెలుగు ప్రేక్షకులు నుండి పొందింది.
యానిమల్ సినిమా చూసి నవ్వుకున్నా
ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రస్తుతం సారంగపాణి జాతకం అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి (Priya Darshi) కీలకపాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఇంటర్వ్యూలో మోహన్ కృష్ణ మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా యాక్షన్ ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు ఆ యాక్షన్ కి సరైన కారణం ఉండాలి, అలా కారణం లేకుండా హీరో మగతనం చూపించడం కోసం చేయకూడదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా చూస్తే తనకు యానిమల్ సినిమా నచ్చలేదని, ఆ సినిమాను చూసి నేను చాలా నవ్వుకున్నాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఇంకో టాపిక్ అవుతుంది అంటూ చెప్పకు వచ్చాడు. అలానే పుష్ప సినిమా పార్ట్ వన్ మాత్రమే తనకు బాగా నచ్చిందని, పార్ట్ టు అల్లు అర్జున్ వన్ మెన్ షో అంటూ చెప్పుకొచ్చారు. ఒక కల్కి సినిమా తనకి బాగా నచ్చింది అని తెలిపారు ఇంద్రగంటి.
Also Read : Prabhudeva: నయనతార వల్లే విడిపోలేదు.. నిజాలు బయటపెట్టిన ప్రభుదేవా భార్య..!