Ram Pothineni: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ హ్యాండ్సం హీరో అంటే అందరికీ గుర్తొచ్చేది రామ్ పోతినేని. దేవదాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రామ్. చాలామంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ గా మారిపోయాడు. చాలా చిన్న ఏజ్ లోనే తాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని హీరోగా మంచి పేరు సాధించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు పెదనాన్న స్రవంతి రవి కిషోర్ నిర్మాత కాబట్టి రామ్ హీరో అవుతున్నాను అని అంటున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ రామ్ నిజంగానే సినిమాల్లో మంచి పేరు సంపాదించాలి అని అనుకున్నాడు. అందుకనే ముందుగా తెలుగులో కాకుండా తమిళ్లో షార్ట్ ఫిలిం చేయడం మొదలుపెట్టాడు. షార్ట్ ఫిలిమ్స్ పెద్దగా లేని తరుణంలో రామ్ ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేశాడు. అది చూసి దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి రామ్ హీరోగా పెట్టి దేవదాస్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ముందుగా అనుకున్న రెస్పాన్స్ రాలేదు, కానీ తర్వాత తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఈ సినిమాకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. ఊహించినంత హిట్ సినిమా అయిపోయింది.
ఇక ప్రస్తుతం రామ్… మహేష్ బాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సంగతే తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను దసరా కానుక రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. ఈ సినిమాకి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఎనర్జిటిక్ రామ్ లుక్స్ రివిల్ అయ్యాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ ఈ వీడియోలో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. లాంగ్ హెయిర్ తో క్లీన్ సేవ్ లో ఈ వీడియోలో మనం రామ్ ను గమనించవచ్చు. రామ్ బయట ఎంత ఎనర్జీతో ఉంటాడు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ వీడియోలో మాత్రం ఎందుకో కొంచెం డల్ గా కూడా కనిపిస్తున్నాడు అని చెప్పొచ్చు. బహుశా సినిమాకి సంబంధించిన సీన్ లో ఇన్వాల్వ్ అవ్వడం వలన ఆ లుక్ లో ఉన్నాడా అనే ఆలోచన కూడా మొదలవుతుంది.
రీసెంట్ టైమ్స్ లో రామ్ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన డబల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలిపోయింది. ఇక ప్రస్తుతం అంచనాలన్నీ కూడా మహేష్ బాబు దర్శకత్వంలో వస్తున్న సినిమా పైన ఉన్నాయి. మిసెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు ఈ సినిమాతో ఏ స్థాయి హిట్ అందుకుంటాడు వేచి చూడాలి. ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రిలీజ్ చేయనుంది చిత్ర యూనిట్.
Also Read : Nithya Shetty : చిరు విడిచిన చొక్కనే వాడేవాడు… దేవుళ్లు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ సంచలన కామెంట్