BigTV English

France Nuclear Weapons Ukraine : ఉక్రెయిన్ యుద్ధం కోసం ఫ్రాన్స్ అణ్వాయుధాలు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా

France Nuclear Weapons Ukraine : ఉక్రెయిన్ యుద్ధం కోసం ఫ్రాన్స్ అణ్వాయుధాలు.. వార్నింగ్ ఇచ్చిన రష్యా

France Nuclear Weapons Ukraine | రష్యాతో జరుగుతున్న సుదీర్ఘ యుద్ధంలో ఉక్రెయిన్ భద్రత కోసం అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా ఉపయోగించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశంలో ముందుకు వచ్చిన ఈ ప్రతిపాదన చర్చనీయాంశమైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ తన అణ్వాయుధాలను యుద్ధంలో ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు సభ్య దేశాల నుంచి భారీ స్పందన లభించింది.


పోలండ్‌తో పాటు లాత్వియా, లిథువేనియా వంటి పలు బాల్టిక్ దేశాలు.. మాక్రాన్ చేసిన ఈ ప్రతిపాదనను గట్టిగా సమర్థించాయి. మొత్తం యూరోపియన్ యూనియన్‌లో అణ్వాయుధాలు మెండుగా ఉన్న ఏకైక దేశం ఫ్రాన్స్ కావడం విశేషం. ఫ్రాన్స్‌కున్న ఈ సామర్థ్యాన్ని యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని జాతిని ఉద్దేశించి బుధవారం చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్ ప్రకటించారు. ఈ విషయంపై లోతైన చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు.

Also Read:  మీడియా ముందే ఏడ్చేసిన కెనడా ప్రధాని


అయితే ఫ్రాన్స్ చేసిన ఈ ప్రతిపాదనపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ‘‘శాంతి ప్రయత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గుచూపుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగాలనే ఫ్రాన్స్ ఆశిస్తోంది. దీనికి మాక్రాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే రుజువు’’ అని దిమిత్రీ ఆరోపించారు.

రష్యా ముప్పు పొంచి ఉంది
రష్యా యురోప్కు పెను ముప్పు పొంచి ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పేర్కొన్నారు. క్రెమ్లిన్ తన అమ్ములపొదిలోకి వేల సంఖ్యలో ట్యాంకర్లను, వందల సంఖ్యలో యుద్ధ విమానాలను అదనంగా చేరుస్తోందని అన్నారు. బడ్జెట్‌లో 40% నిధులను రక్షణపైనే మాస్కో ఖర్చు పెడుతోందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రేక్షకుడిగా ఉండటం పిచ్చితనమే అవుతుందని, ఆ దేశాన్ని నిలువరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫ్రాన్స్ తన అణ్వాయుధాలతో యురోప్ను రక్షించడానికి సిద్ధంగా ఉందని, ఈ విషయంపై ఇతర మిత్రదేశాలతో చర్చిస్తానని తెలిపారు. యురోప్ భవిష్యత్తును వాషింగ్టన్‌లోనూ, మాస్కోలోనూ నిర్ణయించకూడదని అన్నారు. ఉక్రెయిన్‌కు యురోప్ దీర్ఘకాలం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అవసరమైతే యురోప్ దళాలను ఆ దేశంలో మోహరించాలని పిలుపునిచ్చారు.

అమెరికా నిరాకరించినా ఫ్రాన్స్ నిఘా సమాచారం అందిస్తుంది

ఇటీవల అమెరికా అధ్యక్ష భవనంలో మీడియా ముందే ఉక్రెయిన్, అమెరికా అధ్యక్షుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వెంటనే గత బుధవారం నుంచి ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సమాచారం ఇవ్వడం ఆపేసింది. దీంతో ఫ్రాన్స్ రంగంలోకి దిగింది. కీవ్‌కు అండగా ఉంటామని పేర్కొంది. తాము ఎప్పటికప్పుడు నిఘా సమాచారాన్ని ఉక్రెయిన్‌తో పంచుకుంటామని తెలిపింది.

ఉక్రేనియన్లకు ట్రంప్ షాక్
అమెరికా వలస వచ్చిన  దాదాపు 2,40,000 మంది ఉక్రేనియన్లకు ట్రంప్ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఉక్రెయిన్ వలసదారులందరినీ అక్రమ వలసదారులుగా ప్రకటించి.. ఏప్రిల్‌లో వారిని స్వదేశానికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీరందరూ రష్యా యుద్ధం బాధితులే అయినా వీరిని వెనక్కు పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ట్రంప్ యంత్రాంగంలో సీనియర్లు ధ్రువీకరించారు.

కష్టకాలంలో అండగా నిలిచే యురోప్ దేశాలకు ధన్యవాదాలు: జెలెన్‌స్కీ
తమ దేశం కష్టాల్లో ఉన్న సమయంలో అండగా నిలిచిన యురోప్ దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలియజేవారు. యురోప్ భద్రతా మండలి సదస్సుకు హాజరయ్యేందుకు బ్రసెల్స్‌ చేరుకున్న ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఒంటరిగా లేమన్న భావనను యురోప్ కలిగించిందని తెలిపారు.

జెలెన్‌స్కీ స్వస్థలం క్షిపణి దాడి చేసిన రష్యా.. నలుగురు మృతి
ఉక్రెయిన్‌లోని జెలెన్‌స్కీ స్వస్థలం క్రీవ్ రీహ్‌లోని ఒక హోటల్‌పై రష్యా బుధవారం రాత్రి క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఆ హోటల్‌లో తమ దేశ పౌరులతో పాటు అమెరికా, బ్రిటన్‌ జాతీయులు ఉన్నారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వెల్లడించారు.

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×