Bunny Vasu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలలో బన్నీ వాసు ఒకరు. అల్లు అర్జున్ కు బన్నీ వాసు స్నేహితుడు అనే విషయాన్ని కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు సందర్భాలలో అల్లు అర్జున్ బన్నీ వాసు గురించి మాట్లాడుతూ భారీ ఎలివేషన్లు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 100% లవ్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నిర్మాతగా పరిచయం అయ్యాడు బన్నీ వాసు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతోనే GA2 బ్యానర్ ఏర్పడింది. భారీ సినిమాలన్నీ గీత ఆర్ట్స్ నిర్మిస్తే, కొన్ని మిడ్ రేంజ్ సినిమాలను GA2 బ్యానర్లు బన్నీ వాసు నిర్మిస్తూ ఉంటారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో బన్నీ వాసుకు మంచి అనుబంధం ఉంది. ఒక తరుణంలో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తారు అని వార్తలు కూడా వచ్చాయి.
థియేటర్ ఇష్యూ పైన రెస్పాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మొదట జూన్ 12న విడుదల కాబోతుంది అని అధికారికంగా ప్రకటించారు. అప్పుడే థియేటర్లు కూడా బంద్ అవుతాయి అని వార్తలు వచ్చాయి. దీనిపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయిపోయి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆ తరుణంలో బన్నీ వాసు రియాక్ట్ అయ్యారు. “సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు చాలా సైలెంట్ గా ఉంటాయి.. అలాగే చాలా లోతుగానూ ఉంటాయి. ఈ రాజకీయాల రొచ్చులో ఇండస్ట్రీ నలుగుతుంది అనేది ఇప్పటికైనా సరే.. ప్రొడ్యూసర్స్ గానీ.. డిస్ట్రిబ్యూటర్స్ కానీ.. ఎగ్జిబిటర్స్ కానీ గ్రహించాలి. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఒకరు డిప్యూటీ సీఎం అయిన వాళ్ళనే మనం ఇరిటేట్ చేసామంటే.. మన యూనిటీ ఎలా ఉంది అని ప్రశ్నించుకునే సమయం వచ్చింది” అని వాసు మాట్లాడిన మాటలు పైన కొంతమేరకు పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి.
వ్యాపారం – ఉపదేశం
ఇక రీసెంట్ గా బన్నీ వాసు వేసిన ట్వీట్ తన మీద విపరీతమైన నెగెటివిటీ తీసుకొస్తుంది. దీని కారణం బన్నీ వాసు కొన్ని ప్రధానమైన అంశాలు మాట్లాడినా కూడా, ఓటిటి విషయంలో మాట్లాడిన పద్ధతి. “సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటిటికి ఇవ్వాలి అనే ట్రెండ్ కొనసాగితే .. రాబోయే నాలుగైదు ఏళ్లలో 90 శాతం సింగిల్ స్క్రీన్స్ మూసుకుపోతాయి” అని బన్నీ వాసు ట్వీట్ లో తెలిపారు. మూడు వారాల క్రితం బన్నీ వాసు నిర్మాతగా విడుదలైన ‘సింగిల్’ (హీరో శ్రీ విష్ణు) సినిమా ఇప్పుడే నాలుగు వారాలు పూర్తికాకముందే Amazon OTTలో వచ్చేసింది. తన సినిమా అయితే వెంటనే OTTకి అమ్మేసి, ఇక ఇండస్ట్రీ వాళ్లకు OTT గ్యాప్ గురించి ఉపదేశాలు ఇస్తారు ఈయన. అంటూ బన్నీ వాస్ పైన ట్రోలింగ్ మొదలైంది. ఏదైనా జెన్యూన్ గా మాట్లాడితే ఓకే కానీ అప్పటి పరిస్థితులను ఉపయోగించుకొని, తన తప్పిదాన్ని మర్చిపోయి అవతల వాళ్ళకి ఉపదేశం ఇవ్వడం కరెక్ట్ కాదు అనేది కొంతమంది అభిప్రాయం.
ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ గ్రహించవలసింది, కరెక్ట్ చేసుకోవాల్సింది పర్సంటేజ్ సిస్టం కాదు.. ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించడం ఎలా అని..! ఇప్పుడున్న అర్ధ రూపాయి వ్యాపారంలో నీది పావుల.. నాది పావలా అని కొట్టుకోవడం కాదు.. మునపటిలా మన వ్యాపారాన్ని రూపాయికి ఎలా తీసుకెళ్లాలి…
— Bunny Vas (@TheBunnyVas) June 6, 2025