BigTV English

Sivakarthikeyan : రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గని అమరన్.. అన్ని కొట్లా..?

Sivakarthikeyan : రెమ్యూనరేషన్ విషయంలో వెనక్కి తగ్గని అమరన్.. అన్ని కొట్లా..?

Sivakarthikeyan : కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఆయన తమిళంలో చేసిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి మంచి హిట్ ని అందుకున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ తన మార్క్ చాటుకుంటున్నాడు శివ కార్తికేయన్. లాస్ట్ ఇయర్ అమరన్ తో 300 కోట్లు కలెక్ట్ చేసి స్టార్ లీగ్ లో చేరిపోయాడు. ఇటీవల ఈ హీరో నటిస్తున్న సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం మదరాసి, పరాశక్తి రెండు సినిమాలతో వస్తున్నాడు శివ కార్తికేయన్.. అయితే తాజాగా శివ కార్తికేయన్ రెమ్యూనరేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..


Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ సినిమాలు..

రెమ్యూనరేషన్ ను పెంచేసిన హీరో.. 


తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయన రెమ్యూనిరేషన్ కూడా భారీగా పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు సినిమాకు 10 కోట్ల లోపే రెమ్యునరేషన్ గా తీసుకునే శివ కార్తికేయన్ హిట్లు కొడుతుండటం వల్ల డిమాండ్ పెరిగింది. దానికి తగినట్టుగానే పారితోషికం కూడా పెంచేశాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ ఒక సినిమాకు 35 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని  తమిళ ఇండస్ట్రీలో టాక్. గతంలో తీసుకుంటున్న దానికంటే డబల్ ఇప్పుడు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలను చూస్తే.. 

మదరాసి సినిమా మురుగదాస్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా విషయంలో శివ కార్తికేయన్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మురుగదాస్ ఇప్పుడు ఏమాత్రం ఫాం లో లేడు.. ఇటీవల ఆయన ఖాతాలో సికిందర్ వంటి డిజాస్టర్ మూవీ ఉంది. అయితే సికందర్ ఎఫెక్ట్ శివ కార్తికేయన్ సినిమా మీద పడకుండా జాగ్రత్త వహిస్తున్నారు. మదరాసి సినిమా ఫస్ట్ గ్లింప్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి.. ఇక దీంతో పాటుగా మరో సినిమాలో నటిస్తున్నాడు. సుధ కొంగర డైరెక్షన్ లో చేస్తున్న పరాశక్తి సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని తెలుస్తుంది. ఈ మూవీ పీరియాడికల్ స్టూడెంట్ డ్రామాగా వస్తుంది.. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా ఉన్నాయి. మదరాసి మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతుంది. పరాశక్తి సినిమా మాత్రం వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది.. ఇక పోతే ఈ సినిమాల తో శివ కార్తికేయన్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. శివ కార్తికేయన్ తో సినిమా కోసం తమిళ దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అమరన్  సినిమా తర్వాత ఈ హీరో రేంజ్ పూర్తిగా మారిపోయిందని ఇప్పటికే అందరికీ అర్థమైంది..

ఇప్పటివరకు శివ కార్తికేయన్ నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. అందులోనూ రేమో సినిమా కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. ఇప్పటికీ ఆ సినిమా టీవీలలో వస్తే అందరూ సినిమా చూడడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక ముందు ముందు శివ కార్తికేయన్ ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులను పలకరిస్తాడో చూడాలి…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×