BigTV English

Meher Ramesh : అది కేవలం సందీప్ రెడ్డి వంగాకు మాత్రమే సాధ్యం అయింది

Meher Ramesh : అది కేవలం సందీప్ రెడ్డి వంగాకు మాత్రమే సాధ్యం అయింది

Meher Ramesh : కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే సందీప్ రెడ్డి వంగ అనగానే ఒక బ్రాండ్. మొదటి సినిమా అర్జున్ రెడ్డి తోనే తన మార్క్ ఏంటో చూపించి చాలామంది తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. అంటే ఒక మామూలు కథను ఇలా కూడా తీయొచ్చు అని సినిమాకి ఒక కొత్త నిర్వచనాన్ని చాలా ఏళ్లు తర్వాత ఇచ్చాడు. ఒకే ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమాకి రాంగోపాల్ వర్మ అందించిన శివ సినిమా కొత్త పుంతలు తొక్కించింది. అలా చాలా ఏళ్లు తర్వాత సినిమా చాలా కొత్తగా అనిపించిన ఫీల్ అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి మొదటి షో పడిన వెంటనే విపరీతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. వెంటనే బాలీవుడ్ లో సినిమా చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించాడు.


అది సందీప్ రెడ్డి వంగకి సాధ్యం 

రీసెంట్ గా ఒక బుక్ లాంచ్ వేడుకకు హాజరైన చాలామంది డైరెక్టర్స్ లో మెహర్ రమేష్ ఒకరు. ఈ వేడుకలో మెహర్ రమేష్ సందీప్ రెడ్డి వంగాను ఉద్దేశిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. లవ్ రెబల్ అనాలా అంటూ మొదలుపెట్టి అర్జున్ రెడ్డి సినిమా తీయడాన్ని ఎవరు ఆపలేరు. అలానే అర్జున్ రెడ్డి రాయడానికి కూడా ఎవరు ఆపలేరు. ఒక తెలుగువాడు బాలీవుడ్ కి వెళ్లి తెలుగు వాడి సత్తా ఏంటో చూపించారు. అతి తక్కువ బడ్జెట్లో అర్జున్ రెడ్డి సినిమాను తీసి దాన్ని కబీర్ సింగ్ గా మరిచి బాలీవుడ్ లో కూడా సక్సెస్ అయ్యాడు. స్పిరిట్ సినిమా నుంచి యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు మంచి మ్యూజిక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటూ మెహర్ రమేష్ సందీప్ రెడ్డి వంగ పైన ప్రశంసలు కురిపించారు. గతంలో మెహర్ రమేష్ ప్రభాస్ హీరోగా బిల్లా అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే.


అంచనాలన్నీ స్పిరిట్ సినిమా మీదే 

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి. కబీర్ సింగ్ సినిమా విడుదలైనప్పుడు చాలామంది బాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ ఆ సినిమాను టార్గెట్ చేశారు. అది ఒక వైలెంట్ ఫిలిం అంటూ మాట్లాడారు. ఆ తరుణంలోనే సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ అసలు వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ ఛాలెంజ్ చేశాడు. చెప్పిన విధంగానే అనిమల్ సినిమాతో తన సత్తా ఏంటో చూపించి బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న స్పిరిట్ సినిమా కూడా పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల కానుంది. రీసెంట్ గా తన సినిమాలో హీరోయిన్ ను మారుస్తూ బాలీవుడ్ కి బిగ్గెస్ట్ షాక్ ఇచ్చాడు.

Also Read : 3 Roses Season 2 : బూతులు మింగేసాడు, శ్రీ విష్ణు బాటలో సత్య

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×