OTT Movie : ఓటీటీలో ఎన్నో రకాల స్టోరీలతో సినిమాలు వస్తున్నాయి. అయితే వీటిలో మలయాళం సినిమాలపై ఓ కన్నేస్తున్నారు మూవీ లవర్స్. ఎటువంటి స్టోరీలను అయినా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక వ్యక్తికి వచ్చే కలల చుట్టూ నడుస్తుంది. ఈ సినిమా చివరి వరకూ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
డాక్టర్ మహేష్ నారాయణ్ తన భార్య శ్వేత, కూతురు తనూతో ఒక రోజు సొంత ఊరికి వస్తాడు. మహేష్ తన కుటుంబం తో కలసి ఒక ట్రిప్ కి వెళతాడు. అక్కడ మహేష్ ఒక హిల్ స్టేషన్‌లో స్పృహ తప్పి పడిపోతాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత, తనను ఒక లారీ ఢీకొట్టినట్లు గుర్తుచేసుకుంటాడు. కానీ అది నిజంగా జరిగినట్లే అనిపించినా, చివరికి ఆ ప్రమాదం ఒక కలగా గుర్తిస్తాడు. అయితే అతని కలలు అమీర్, ఏంజెల్ అనే ఇద్దరు వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నట్లు గ్రహిస్తాడు. తనకి తెలిసిన జాన్ మాస్టర్ సహాయంతో, మహేష్ లూసిడ్ డ్రీమింగ్ గురించి తెలుసుకుంటాడు. ఇది అతని కలలలో వచ్చే సంఘటనలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
అతని కలలలో కనిపించే అమీర్, ఏంజెల్ అనే ఇద్దరు పిల్లల గురించి తెలుసుకోవడానికి, అతను కొచ్చు త్రెస్సియా అనే మహిళను కలుస్తాడు. ఆమె సహాయంతో, కలలోకి వచ్చిన ఏంజెల్‌ను కనిపెడతాడు. ఆమె ఇప్పుడు లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటుంది. ఆమెను కలసిన మహేష్ తనకు జరిగిన వింత అనుభవాలను పంచుకుంటాడు. మహేష్ చెప్పిన వాటిని ఏంజెల్ మొదట్లో నమ్మదు. కానీ మహేష్ ఆమెకు కలలోని ఒక సంఘటనను గుర్తు చేస్తాడు. ఆ తరువాత ఒక్కసారిగా ఆమె షాక్ అవుతుంది. ఇక స్టోరీ కూడా ఓ లెవల్లో మారిపోతుంది. చివరికి మహేష్ కలలోకి వస్తున్నవి నిజమేనా ? కలలో మహేష్ కి అమీర్, ఏంజెల్ ఎందుకు కనబడుతున్నారు ? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.
Read Also : నిర్మానుష్యమైన బీచ్ లో మనుషుల్ని టార్చర్ చేసే మాన్స్టర్… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ మావా
ఈ టీవీ విన్ (Etv win)లో
ఈ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ పేరు ‘పెండులం’ (Pendulum). 2023 లో వచ్చిన ఈ సినిమాకు రెజిన్ ఎస్. బాబు దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ బాబు, రమేష్ పీస్రోడి, దేవకీ రాజేంద్రన్,అనుమోల్, ప్రకాష్ బారే వంటి నటులు నటించారు. ఈ మూవీ లూసిడ్ డ్రీమింగ్ టైమ్ ట్రావెల్ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చింది. ఈటీవీ విన్ (Etv win) తెలుగు డబ్బింగ్ వెర్షన్ లో కూడా ఈ మూవీ అందుబాటులో ఉంది.