Pawan Kalyan :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా గబ్బర్ సింగ్ సినిమాకు ఉన్న స్థాయి వేరు స్థానం వేరు. దాదాపు పది సంవత్సరాలు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అది. పవర్ స్టార్ అభిమానులు పవన్ కళ్యాణ్ నుంచి ఏ ఏ అంశాలు కోరుకుంటారో వాటన్నిటిని ఆ సినిమాలో డిజైన్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఆ సినిమా ఒక కంప్లీట్ ఫుల్ మిల్. హరీష్ శంకర్ ఆడియో లాంచ్ లో చెప్పిన ప్రతి మాటను ఆ సినిమా నిజం చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నాకు కొంచెం తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది. నా తిక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా అని పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగ్ ఇప్పుడు రియల్ లైఫ్ లో వర్క్ అవుట్ అయ్యేలా ఉంది.
అసలు జరిగిన విషయం
క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు. ఎన్నో రీమేక్ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ కెరియర్ కు ఒక స్ట్రైట్ ఫిలిం వచ్చింది అని ఈ సినిమా మొదలైనప్పుడు చాలామంది సంతోషించారు. ఎప్పుడూ రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. మొత్తానికి ఈ సినిమా జూన్ 12న విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఎగ్జిబిటర్స్ కి ఎప్పటినుంచో కొన్ని సమస్యలు ఉండటం వలన థియేటర్స్ బంద్ చేసి ఆ సమస్యలను తీర్చాలి అని కొంతమంది నిర్మాతలు అనుకున్నారు. ఆ నిర్మాతలలో ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, ఏసియన్ సునీల్ పేర్లు గట్టిగా వినిపించాయి. ఆ నలుగురు అంటూ చాలా కథనాలు కూడా వినిపించాయి. అయితే వీరిలో ఇద్దరు బహిరంగంగా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. థియేటర్స్ బందు కావట్లేదు అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు
గత ప్రభుత్వం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎటువంటి అన్యాయం చేసిందో అందరికీ తెలిసిన విషయమే. టికెట్ రేట్ల విషయంలో ప్రవర్తించిన తీరు దారుణం. ఈ ప్రభుత్వం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఆదరణంగా నిలబడింది. కానీ ఆ ప్రభుత్వానికి సరైన గౌరవం ప్రస్తుతం ఉన్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇవ్వలేదు అనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయం. తాజాగా పవన్ కళ్యాణ్… రాష్ట్రంలో థియేటర్ల నిర్వహణపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేషు కు Dy.CM పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘ప్రేక్షకులు కుటుంబంతోసహా హాళ్లకు రావాలంటే టికెట్లు, ఫుడ్ ధరలు అందుబాటులో ఉంచాలి. టికెట్ల ధరల పెంపు కావాలంటే ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలి. థియేటర్ల బంద్ నిర్ణయం వెనుక ఎవరున్నారో విచారణ చేపట్టాలి. ఇందులో జనసేన వాళ్లు ఉన్నా ఉపేక్షించొద్దు’ అని పేర్కొన్నారు. ఇక ముందు ముందు నిర్మాతలు ఏం మాట్లాడతారో వేచి చూడాలి.
Also Read: మిస్సయిన హార్డ్ డిస్క్ లో ప్రభాస్ సీన్స్.. ఇదంతా ప్లానింగ్ ప్రకారమేనా..?