Mahesh Babu – Sitara:సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu).. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి పేరు తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన తండ్రి దివంగత నటులు, లెజెండ్రీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నటనను ఉనికి పుచ్చుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన.. అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ గా ఎదిగి పోయారు. ఇక ప్రస్తుతం రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 (SSMB 29) అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. మహేష్ బాబు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో కొంతమేర పూర్తి చేశారు.. ఇక తదుపరి షెడ్యూల్ మే నెలలో ప్రారంభం కాబోతోంది. ఇక ఇప్పుడు ఈ గ్యాప్ ను ఫుల్ ఫిల్ చేసుకోవడానికి మహేష్ బాబు తన కూతురు సితార (Sitara) తో కలిసి ఒక ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి ప్రమోషన్ చేశారు.
కొత్త యాడ్ తో మళ్ళీ ఆకట్టుకున్న తండ్రీకూతురు..
ఈ ప్రమోషన్ యాడ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. “ఇంటికి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందంటారు. ఇక పాప కళ్ళల్లో ఆ మెరుపును చూసి సితార అని పేరు పెట్టాము” అంటూ తన కూతురి గురించి , పాప మధుర క్షణాలను ఫోటోల రూపంలో బంధించిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉన్నట్టు వీడియో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత తన కూతురు సితార తన డ్రెస్సింగ్ రూమ్ లో జ్యువెలరీ సెట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు మహేష్ బాబు.. ఆ బ్రాండ్ కు సంబంధించిన ఒక నెక్ పీస్ ను తన కూతురికి బహుమతిగా ఇస్తారు. అది ధరించిన సితార అందంతో, ఆనందంతో వెలిగిపోతుంది. దాంతో ఈ వీడియో కూడా ఎండ్ అవుతుంది. ఇక మొత్తానికైతే తండ్రి కూతురు ఇద్దరు కలిసి చేసిన ఈ యాడ్ ప్రమోషన్ చాలా అందంగా ఉందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
గతంలో సితార – మహేష్ బాబు చేసిన యాడ్ ప్రమోషన్స్ ఇవే..
మహేష్ బాబు, సితార కలసి మొదటిసారి ట్రెండ్స్ బ్రాండ్ దుస్తుల కోసం పనిచేశారు. ఇక ఈ యాడ్ ఎంతలా పాపులారిటీ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత వీరిద్దరూ కలసి Gen Z అనే భాషను నేర్పే యాప్ కోసం కూడా పనిచేశారు. ముఖ్యంగా తండ్రీ కూతురు కలిసి నటించిన ఈ ప్రకటన మరింత క్రేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఒక రియల్ ఎస్టేట్ సంస్థను కూడా ప్రమోట్ చేస్తూ యాడ్ చేయడం జరిగింది. ఈ తండ్రి కూతురు ఇద్దరూ కలిసి పలు ప్రకటనల కోసం పనిచేస్తూ ఆ బ్రాండ్స్ కి సరికొత్త ఇమేజ్ తెచ్చి పెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇలా తండ్రీ కూతురు కలిసి యాడ్స్ చేసిన వారిలో వీరే ప్రధమ స్థానంలో ఉంటారని చెప్పవచ్చు.