BigTV English

YS Jagan: నాగ స్టోరీ మొత్తం చెప్పేసిన జగన్.. అంతా ఆయనే చేశారు..

YS Jagan: నాగ స్టోరీ మొత్తం చెప్పేసిన జగన్.. అంతా ఆయనే చేశారు..

YS Jagan: వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పల్నాడు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే ఇందుకు నిదర్శనమని జగన్ వ్యాఖ్యానించారు.


రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. కూటమి గెలిపించుకోవడానికి అన్యాయాలు చేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఉపసర్పంచ్. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ టీడీపీ, జనసేన నేతలు తప్పుడు ఆరోపణలతో ఆయనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆయనను అవమానించి మాట్లాడారు. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి కూడా చేశారు. ఆయనను తీవ్రంగా ఇబ్బందికి గురిచేశారు. లేకుంటే రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు బెదిరించారు’ అని జగన్ చెప్పారు.

READ ALSO: Kavitha : బావతోనూ గొడవ? కవిత టైంపాస్ కహానీ..


జూన్ 5న రాత్రి సమయంలో పోలీసులు ఆయనను విడిచిపెట్టారు. ఆ తర్వాత గుంటూరులోని తన తమ్ముడి ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి తండ్రికి కాల్ చేసి పోలీసులు బెదిరిస్తున్నారని.. చెప్పారు. పోలీసుల తీరుతోనే.. నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్నారు. తన కొడుకును కాపాడుకోవడానికి వెంకటేశ్వర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన ఇంటిపై దాడి చేసిన వారిపై ఇప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని జగన్ ఫైరయ్యారు.

READ ALSO: Jagan convoy: దారుణం.. జగన్ పర్యటనలో మరొక వ్యక్తి మృతి

నాగమల్లేశ్వరరావును బెదిరించిన పోలీసులపై సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి..? ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. వాళ్లకు ఇప్పుడు సమాధానం చెబుతారు? ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా బాధలోనే ఉంది. ఇదే నియోజకవర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపై పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×