BigTV English

Mambo Movie: ఆసియాలోనే తొలి చిత్రంగా ‘మాంబో’.. నిజమైన సింహంతో పాన్ ఇండియా సినిమా..!

Mambo Movie: ఆసియాలోనే తొలి చిత్రంగా ‘మాంబో’.. నిజమైన సింహంతో పాన్ ఇండియా సినిమా..!

Real Lion in Mambo Movie: ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఫుల్ మాస్ యాక్షన్ ప్యాక్డ్ సినిమాలనే ఇష్టపడుతున్నారు. ఆ మాస్ యాక్షన్‌కి కాస్త విజువల్ ఎఫెక్ట్స్ కలిపి తీసే సినిమాలు బాగా హిట్ అవుతున్నాయి. ఇక ప్రేక్షకుల నాడిని పట్టేసిన ప్రముఖ దర్శకులు అలాంటి సినిమాలనే తెరకెక్కించి హిట్లు కొడుతున్నారు. బాహుబలి, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, సలార్ వంటి చిత్రాలు పిచ్చ మాస్ యాక్షన్‌తో వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అదే క్రమంలో హనుమాన్, కల్కి సినిమాలకు కాస్త విజువల్ ఎఫెక్ట్స్ జోడించి తెరకెక్కించడంతో మహా మహా బ్లాక్ బస్టర్ అయ్యాయి.


ఇక ఇప్పుడు అదే ఫాంటసీతో చిరంజీవి ‘విశ్వంభర’, తేజ సజ్జ ‘మిరాయ్’, మహేశ్ బాబు ‘ఎస్ఎస్ఎంబీ 29’ వంటి సినిమాలు కూడా వస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఇప్పుడంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. బడా బడా దర్శకులు వీటిపైనే ఫుల్‌గా ఫోకస్ పెడుతున్నారు. అయితే వారంతా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంటే ఓ డైరెక్టర్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాడు. యాక్షన్, ఫాంటసీలకు దూరంగా ఉంటూ ప్రకృతి, జంతువులు, అడవులు అంటూ సినిమాలు తీస్తూ తన క్రియేటివిటీతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నాడు.

ఆ దర్శకుడు మరెవరో కాదు.. టాలీవుడ్ బడా హీరో రానాతో ‘అరణ్య’ మూవీ తీసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రభు సాల్మాన్. వరుసగా అడవులు, జంతువుల నేపథ్యంలో సినిమాలు తీస్తూ నేచర్‌పై తనకున్న ప్రేమను దర్శకుడు చాటుకుంటున్నాడు. గతంలో మేనా (తెలుగులో ప్రేమఖైదీ)గా సినిమా తీశాడు. ఈ మూవీ తర్వాత ఏనుగు క్యారెక్టర్‌తో ‘గజరాజు’ అనే సినిమా తెరకెక్కించాడు. ఆ తర్వాత రానాతో ‘అరణ్య’ తెరకెక్కించాడు. ఇందులో కూడా అడవులు, ఏనుగులను చూపించాడు. వరుసగా ఇలాంటి నేపథ్యంలోనే సినిమాలు తీస్తూ వస్తున్నాడు.


Also Read: ఎన్టీఆర్‌ ఎనర్జీపై జాన్వీ ప్రశంసలు.. నాకు 10 రోజులు.. తారక్‌కు ఒక్క సెకన్ అంటూ

ఇక ఇప్పుడు కూడా అలాంటి జానర్‌లోనే ఓ సినిమా తీస్తున్నాడు. అయితే ఈ సారి పాన్ ఇండియా రేంజ్‌లో ఏకంగా నిజమైన సింహాన్ని పెట్టి సినిమా తీస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వనిత విజయ్ కుమార్ కుమారుడు విజయ్ శ్రీహరి హీరోగా చేస్తున్న తొలి సినిమా ‘మాంబో’. ఈ చిత్రానికి ప్రభు సాల్మాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నిజమైన సింహాన్ని పెట్టి అతడు ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఒక మనిషికి, కృూర జంతువుకు మధ్య ఏర్పడే ఫ్రెండ్షిప్ ఆధారంగా తెరకెక్కుతోంది.

అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే భారతదేశంలో జంతువులను పెట్టి సినిమాలు తీయడం నిషేదం. అందువల్ల మూవీ యూనిట్ విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆసియాలోనే రియల్ సింహంతో సినిమా తీసిన తొలి చిత్రంగా మాంబో నిలవబోతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సాహసం చేస్తున్న దర్శకుడు ప్రభు సాల్మాన్‌పై సినీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×