BigTV English

HanuMan OTT: ఓటీటీలోకి ‘హనుమాన్’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..

HanuMan OTT: ఓటీటీలోకి ‘హనుమాన్’.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..


HanuMan OTT Release Date: దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తేజా సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో రన్ అవుతుందంటే దాని రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సంక్రాంతికి విడుదలయిన అన్ని సినిమాల్లో ‘హనుమాన్’ మూవీ భారీ రెస్పాన్స్‌తో రికార్డులు క్రియేట్ చేసింది. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాగా.. వాటన్నింటినీ హనుమాన్ మూవీ వెనక్కి నెట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక రెస్పాన్స్‌తో పాటు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను ఈ మూవీ రాబట్టింది. ఇప్పటికే దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి అబ్బురపరచింది.


ఇక ఈ మూవీ రిలీజై ఇంచుమించు 50 రోజులు కావస్తున్నా.. థియేటర్లలో మాత్రం ఈ మూవీ క్రేజ్ ఇంకా తగ్గలేదు. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ తన సత్తా ఏంటో హనుమాన్ చూపిస్తోంది. ఇక నార్త్‌లో అదరగొట్టిన ఈ మూవీ హిందీలో రూ.50 కోట్లు సాధించిన అతి తక్కువ తెలుగు సినిమాల జాబితాలోకి చేరిపోయింది.

READ MORE: ‘హనుమాన్’ సరికొత్త రికార్డ్.. చాలా ఏళ్ల తర్వాత సినీ పరిశ్రమలో ఇలా..!

ఇక ఈ మూవీ థియేట్రికల్ రన్ అనంతరం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీని ఓటీటీలో వీక్షించేందుకు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కు ఓ గుడ్ న్యూస్. ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ రిలీజ్ చేసింది.

‘హనుమాన్’ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 భారీ ధరకు దక్కించుకుందని సమాచారం. దీంతో ఈ మూవీని ముందుగా మార్చి 2న స్ట్రీమ్ చేయాలని జీ5 అనుకుంది. కానీ అది కుదరకపోవడంతో మరో డేట్‌కు షిఫ్ట్ చేసింది. ఈ సారి శివరాత్రి కానుకగా మార్చి 8న ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారికంగా జీ5 వెల్లడించింది.

READ MORE: ఓటీటీలోకి ఒకేరోజు హనుమాన్, ఈగల్.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు..!

హనుమాన్ మూవీని శివరాత్రి సందర్భంగా మార్చి 8న జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి రాకముందే హనుమాన్ సీక్వెల్‌ను దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. ఈ సీక్వెల్ చిత్రానికి ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశాడు. ఈ సీక్వెల్ మూవీ ‘జై హనుమాన్’లో రాముడు, హనుమంతుడిగా స్టార్ హీరోను క్యాస్ట్ చేసుకోవాలని సన్నాహాలు కూడా చేస్తున్నాడు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×