RCB Fans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament ) భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Chennai Super Kings vs Royal Challengers Bangalore ) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో కేవలం రెండంటే రెండు పరుగుల తేడాతో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోవడం జరిగింది. గెలిచే వరకు వచ్చి.. ఓటమిపాలైంది ధోని సేన. అయితే ఈ మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన హోమ్ గ్రౌండ్… చిన్నస్వామి స్టేడియంలో జరగడంతో… లోకల్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.
Also Read: Mitchell Owen – PSL: పాకిస్థాన్ కు ప్రీతి జింటా ఎదురుదెబ్బ…PSL ను వదిలి కుక్కలా వచ్చేశాడు
జడేజా, అశ్విన్ భార్యలపై రెచ్చిపోయిన RCB ఫ్యాన్స్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బెంగళూరు చేతిలో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు… అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయి. చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగడంతో… అక్కడి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. స్టేడియంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎల్లో జెర్సీ వేసుకుంటే చాలు.. కొట్టడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా వ్యవహరించారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు. చాలామంది ఎల్లో జెర్సీలను కూడా చింపేశారు.
అయితే మ్యాచ్ పూర్తయిన తర్వాత… చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన బస్సు… ఎక్కెందుకు రవీంద్ర జడేజా భార్య అలాగే అశ్విన్ భార్య ఇద్దరు కలిసి నడిచి వెళ్తున్నారు. అయితే బస్సు ఎక్కే వరకు… ఆ ఇద్దరూ మహిళలకు చుక్కలు చూపించారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు. RCB… RCB అంటూ కోహ్లీ అభిమానులు రెచ్చిపోయి ప్రవర్తించారు. అయితే వాళ్లు అంతలా అరుస్తున్న… అశ్విన్ ( R Ashwin) అలాగే రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ) భార్యలు మాత్రం సైలెంట్ గా బస్సు ఎక్కి.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో పై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నస్వామి స్టేడియం అయి ఉండి మీరు బతికిపోయారు… లేకపోతే మిమ్మల్ని చంపే వాళ్ళమని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు వార్నింగ్ ఇస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్. ఇక అంతకుముందు… ఏకంగా 500 మంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అభిమానులు ( Royal Challengers Bangalore Fans )… ఎల్లో జెర్సీ ధరించిన ధోని అభిమాని పై దాడి చేయబోయారు. ఆ సమయంలో.. ఎల్లో జెర్సీ ధరించిన కుర్రాడు ఏమాత్రం తగ్గలేదు. వాళ్లకు ఎదురు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు. అంతలోపే పోలీసులు వచ్చి వాళ్ళందరినీ… అక్కడి నుంచి తరిమేశారు.
Also Read: Riyan Parag: వరుసగా 6 సిక్సర్లు… అనన్య, సారా అలీ ఖాన్ పై కోపంతో రెచ్చిపోయిన రియాన్ పరాగ్
Jadeja wife and R Ashwin Wife might never come back to Chinnaswamy stadium 😭.
RCB RCB Chants when they enter bus 🥲🤭#RCBvCSK pic.twitter.com/ew9cTugxmH
— Yuva | 𝙰𝙿𝙿𝚄 (@Yuva_Sanchari) May 4, 2025