BigTV English

Sai Rajesh: బేబీ డైరెక్టర్ కు వింత అనుభవం.. అయినా సిగ్గులేకుండా ఆ పని చేసాడట

Sai Rajesh: బేబీ డైరెక్టర్ కు వింత అనుభవం.. అయినా సిగ్గులేకుండా ఆ పని చేసాడట

Sai Rajesh: ఒక్క సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు సాయి రాజేష్. సంపూర్ణేష్ బాబు తో హృదయ కాలేయం అనే సినిమాను తెరకెక్కించి కెరీర్ ను ప్రారంభించిన సాయి రాజేష్.. బేబీ సినిమాతో స్టార్ గా మారిపోయాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా రాజేష్ కు ఎంతో పేరు వచ్చింది.


అయితే.. కొన్నిసార్లు ఒకే పేరుతో ఉన్న సినిమాల వలన ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఇటీవల రిలీజ్ అయిన కల్కి2898ad సినిమా అనుకోని రాజశేఖర్ కల్కికి వెళ్ళినవారు లేకపోలేదు. అలానే రాజేష్ లైఫ్ లో కూడా ఒక వింత అనుభవం ఎదురయ్యింది. తాను తెరకెక్కించిన బేబీ సినిమా అని తెలియకుండా.. సమంత నటించిన ఓ బేబికి తానే డైరెక్టర్ అనుకోని ఒక అభిమాని ఇచ్చిన విందును స్వీకరించినట్లు సాయి రాజేష్ చెప్పుకొచ్చాడు.

“నిన్న ఒక స్నేహితుడు బలవంతం మీద , తన ప్రాణస్నేహితుడి ఇంటికి భోజనానికి వెళ్లాను, “నీ సినిమా అంటే మా వాడికి ప్రాణం, 50 సార్లు చూసుంటాడు, ఇన్నేళ్ల మా స్నేహం లో ఏదిఆడగలేదు, నిన్ను భోజనానికి తీసుకు రమ్మన్నాడు” అన్నాడు. సర్లే మనకి ఈ చపాతీలు, రోటీలు మొహం మొత్తింది, హోమ్ ఫుడ్ తినొచ్చు అని వెళ్లాను..10 రకాల వంటలు, అద్భుతమైన ఆతిథ్యం , ఎంత గొప్ప సినిమా సర్ …అని వాళ్ల ఆవిడ కి, పక్కింటి వాళ్లకి, గేట్ దగ్గర వాచ్ మాన్ కి, కొరియర్ బాయ్ కి, సార్ తో సెల్ఫీ దిగండి, “బేబీ సినిమా డైరెక్టర్“ అని 30 ఫోటో లు ఇప్పించారు.


ఒక గంట తర్వాత ప్లేట్ లో గారెలు, నాటుకోడి పులుసు వడ్డించారు … “మా అమ్మాయి కి సమంత అంటే చాలా ఇష్టమండి, ఒక ఫోటో ఇప్పించండి, మళ్లీ ఎప్పడు చేస్తున్నారు ఆవిడ తో ” అన్నాడు. ఇంత జరిగినా గారెలు సిగ్గు లేకుండా లోపలకి వెళ్లిపోయినాయి.. ఓ బేబీ ” అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఓ బేబీ సినిమాలోని సమంత ఫోటోను కూడా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. కొన్నిసార్లు అంతే.. లైట్ తీసుకోండి అని కొందరు.. సిగ్గులేకుండా గారెలు తిన్నాను అని చెప్పారు చూడండి .. అది సూపర్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×