E-Paper
Advertisement

Israel-Hamas War: గాజా సంక్షోభంలో కీలక పరిణామం.. చర్చలకు హమాస్ అంగీకారం

Israel-Hamas War: గాజా సంక్షోభంలో కీలక పరిణామం.. చర్చలకు హమాస్ అంగీకారం
Advertisement

Israel- Hamas War: తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న గాజా సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ హర్షం వ్యక్తం చేసింది. అంతే కాకుండా ఇజ్రాయిల్ బందీల విడుదలకు అంగీకారం తెలిపింది. అయితే ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక వెల్లడించింది.

గాజా సంక్షోభంలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తొమ్మిది నెలలుగా ఈ సంక్షోభం కొనసాగుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే హమాస్.. అమెరికా ఒప్పందంపై చర్చలకు అంగీకారం తెలిపింది. తొలి దశ ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత తమ దగ్గర ఉన్న ఇజ్రాయిల్ బందీలను విడుదల చేస్తామని తెలిపింది. కానీ ఒప్పందలోకి ప్రవేశించేందుకు ముందుగా ఒక షరతు విధించింది. శాశ్వత కాల్పుల ఒప్పందంపై ఇజ్రాయిల్ తప్పకుండా సంతకం చేయాలని హమాస్ సీనియర్ కమాండర్ చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisement

ఇజ్రాయిల్ ఓ అడుగు ముందుకు వెస్తే.. గాజా యుద్ధానికి తెర పడుతుందని ఇజ్రాయిల్ హమాస్ మధ్య దౌత్యం వహిస్తున్న పాలస్తీనా అధికారి ఒకరు తెలపారు.

మొదటి దశ: ఇది ఆరు వారాల పాటు కొనసాగుతుంది. ఇందులో హమాస్ – ఇజ్రాయిల్ బలగాలు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ పాటించాలి. గాజాలో ప్రజలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయల్ బలగాలు దూరంగా వెళ్లాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాల్సి ఉంటుంది.

Advertisement

రెండవ దశ: సైనికులు సహా సజీవ ఇజ్రాయల్ బందీలను హమాస్ విడిచిపెట్టాల్సి ఉంటుంది. గాజా నుంచి ఇజ్రాయిల్ బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్లాలి.
మూడో దశ: పునర్నిర్మాణ పనులు గాజాలో భారీ స్థాయిలో ప్రారంభం అవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయిన వారి అవశేషాలు వారి కుటుంబాలకు అప్పగించాలి.

Also Read: రిషి సునాక్ సతీమణి డ్రెస్‌పై ట్రోలింగ్స్..ఎందుకో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రూపొందించిన ఈ ప్రతిపాదనలో తాత్కాలిక కాల్పుల విరమణ, మానవతా సాయానికి అనుమతి, ఒప్పందంలో రెండో దశలోకి ప్రవేశించేంత వరకు ఇజ్రాయిల్ తన బలగాల్ని వెనక్కి తీసుకోవడం లాంటి అంశాలు ఉన్నాయి. ఇజ్రాయిల్, హమాస్ తాజా ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×