BigTV English

Devara Pre Release Event: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అన్ని కోట్లా? గట్టిగానే ప్లాన్ చేశారుగా!

Devara Pre Release Event: ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఖర్చు అన్ని కోట్లా? గట్టిగానే ప్లాన్ చేశారుగా!

Devara Pre Release Event: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు జూనియర్ ఎన్‌టీఆర్. కేవలం తెలుగులోనే కాకుండా తనకు ఇతర భాషల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆఖరికి ఫారిన్ భాషల్లో కూడా ఎన్‌టీఆర్‌కు ఫ్యాన్స్ ఉన్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వస్తున్న మూవీ కావడంతో ‘దేవర’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ‘దేవర’ ఎలా ఉంటుందో తమ మాటల్లో చెప్పడానికి మూవీ టీమ్ సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 22న జరగనున్న గ్రాండ్ ప్రీ రిలీజ్ కోసం కోట్లలో ఖర్చు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ప్యాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిటింగ్

భారీ బడ్జెట్‌తో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా ‘దేవర’ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. అందుకే ప్రమోషన్స్ కోసం కూడా ఎంత ఖర్చు చేయడానికి అయినా వెనక్కి తగ్గడం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ మూవీ విడుదల అవుతుండడంతో ప్రతీ భాషలో ప్రమోషన్స్ గట్టిగానే ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇతర భాషల ప్రమోషన్స్ కోసమే అంత కష్టపడితే తెలుగులో ప్రమోషన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మినిమమ్ ఉండాలని ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆశిస్తారు కదా. అందుకే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు మొదలయ్యాయి. పలువురు ప్యాన్ ఇండియా సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగుతున్నారు. అందుకే ఖర్చు కూడా ఆ రేంజ్‌లో ఉందని సమాచారం.


Also Read: దేవర ఫస్ట్ రివ్యూ.. క్లైమాక్స్ సీన్స్ చూస్తే గూస్ బంప్స్ రావడం పక్కా…

మొదటి సినిమా

‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ రూ.2 కోట్లు ఖర్చుచేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు తెలుగు నుండి పలు ప్యాన్ ఇండియా చిత్రాలు విడుదలయ్యాయి. వాటి ప్రమోషన్ కోసం భారీ ఖర్చుతో ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌ను ప్లాన్ చేశారు మేకర్స్. కానీ ఈ రేంజ్‌లో ఏ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఖర్చుపెట్టలేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ‘దేవర’ హిట్ అవుతుందని మేకర్స్‌కు ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని మేకర్స్‌లో పాటు ఫ్యాన్స్ కూడా నమ్మకంతో ఉన్నారు.

‘దేవర’తో ఛాన్స్

ఇప్పటికే ఎన్‌టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా వచ్చింది. అప్పట్లో అది ఒక కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అందులో ఎన్‌టీఆర్‌లోని మరో కోణాన్ని చూపించాడు కొరటాల. అందుకే వీరి కాంబినేషన్‌లో వస్తున్న ‘దేవర’ కూడా హిట్ అవుతుందని చాలామంది ప్రేక్షకులు నమ్ముతున్నారు. ‘దేవర’ కంటే ముందు ‘ఆచార్య’ మూవీని డైరెక్ట్ చేశాడు కొరటాల శివ. కానీ అది డిశాస్టర్‌గా నిలిచింది. అయినా అది పట్టించుకోకుండా ‘దేవర’తో తనకు ఛాన్స్ ఇచ్చాడు ఎన్‌టీఆర్. ఈ మూవీతో జాన్వీ కపూర్ మొదటిసారి తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.. ‘దేవర’లో విలన్ రోల్‌లో అలరించనున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×