Director Siva : ముందుగా సినిమాటోగ్రాఫర్ గా కెరియర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సౌర్యం సినిమాతో దర్శకుడుగా మారాడు శివ. గోపీచంద్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. తెలుగులో కంటే కూడా తమిళ్లో మంచి గుర్తింపు సాధించుకున్నాడు శివ. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు సినిమాను తమిళ్లో శిరుతై పేరుతో రీమేక్ చేశాడు. కార్తి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వరుసగా అజిత్ హీరోగా సినిమాలు చేశాడు శివ. శివ దర్శకత్వం వహించిన రెండు సినిమాలు తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి. మెహర్ రమేష్ (Mehar Ramesh) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన భోళా శంకర్ (Bhola Shankar) ఒరిజినల్ దర్శకుడు శివ తెరకెక్కించిందే. అలానే డాలి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా చేసిన కాటమరాయుడు (Katam Rayudu) ఒరిజినల్ కూడా శివ తెరకెక్కించాడు.
రీసెంట్ గా కంగువా (Kanguva) అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు శివ. ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాకి సంబంధించి అంచనాలన్నీ కూడా నిర్మాత జ్ఞానవేలు రాజా పెంచేశాడు. ఈ సినిమా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి మరో బాహుబలి అవుతుంది అంటూ చాలా ఇంటర్వ్యూలో తెలిపాడు. అలానే పార్ట్ వన్ రిలీజ్ అయినప్పుడు చాలా సినిమాలు పోటీ ఉండొచ్చు కానీ పార్ట్ 2 రిలీజ్ కు మాత్రం చాలా సినిమాలు వెనక్కి తగ్గుతాయి అంటూ తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాకి ఏకంగా 2000 కోట్లు కలెక్షన్స్ కూడా వస్తాయి అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం ఈ కామెంట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి.
Also Read : Sobhita Dhulipala: శోభిత అసలు పేరు ఏంటో తెలుసా.. వెడ్డింగ్ కార్డులో బయటపడ్డ నిజం..?
ఇక దర్శకుడు శివ విషయానికి వస్తే.. యంగ్ హీరో శివ కార్తికేయన్ కు ఒక కథను చెప్పినట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే శివ కార్తికేయన్ (Siva Karthikeyan) కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది. ఇక రీసెంట్ గా అమరన్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు శివ కార్తికేయన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించింది. కేవలం కమర్షియల్ సక్సెస్ సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకి మంచి ప్రశంసలు కూడా వస్తున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో రన్ అవుతుంది. కంగువ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడం కూడా ఈ సినిమాకి కొంతమేరకు ప్లస్ అవుతుంది అని చెప్పాలి.