Indian players – BGT: ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన టీం ఇండియా ప్లేయర్లు ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నటి వరకు విపరీతంగా నెట్స్ లో ప్రాక్టీస్ చేసిన టీమిండియా ప్లేయర్లు.. ఆస్ట్రేలియా లో ఉన్న బీచ్ లో ఎంజాయ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియోను కూడా టీమిండియా ప్లేయర్ ( Indian players) కేఎల్ రాహుల్ ( KL Rahul) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కేఎల్ రాహుల్ తో పాటు జూరెల్, నితీష్ కుమార్ రెడ్డి లాంటి యంగ్ ప్లేయర్లు కూడా బీచ్ కి వెళ్లారు.
ఈ సందర్భంగా బీచ్ లో స్విమింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు టీమిండియా ప్లేయర్లు. అయితే రోజంతా ప్రాక్టీస్ చేసి… అలసిపోయిన తర్వాత బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు కేఎల్ రాహుల్ తన పోస్టుపై… రాసుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ లో భాగంగా… ఆస్ట్రేలియా కి వెళ్ళింది టీం ఇండియా. ఈ టోర్నమెంట్లో ఏకంగా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
ఇందులో నాలుగు టెస్టు మ్యాచ్లు గెలిస్తేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది టీమిండియా. అందుకే టీమిండియా ప్లేయర్లు భారీగా కసరత్తు చేస్తున్నారు. ఆస్ట్రేలియా లాంటి గడ్డపైన టీమిండియా నాలుగు మ్యాచ్లు గెలవడం చాలా కష్టమే. ఇది ఇలా ఉండగా నవంబర్ 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది.
Also Read: RCB New Bowling Coach: RCBకి కొత్త బౌలింగ్ కోచ్…ఇప్పటివరకు ఒకే ఒక్క వికెట్ తీసాడు ?
అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ కు గిల్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. కొడుకు పుట్టిన నేపథ్యంలో రోహిత్ శర్మ మొదటి మ్యాచ్ కు దూరం కాబోతున్నారట. ఈ మేరకు ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలికి సమాచారం కూడా ఇచ్చారట. భారత క్రికెట్ నియంత్రణ మండలి అధికారుల పర్మిషన్ నిమిత్తమే ఆయన ఇండియాలో ఉన్నారు. అయితే రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది.
ఆ సమయానికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా కు వెళ్లి రెండవ టెస్ట్ ఆడతాడు. అయితే మొదటి టెస్ట్ నేపథ్యంలో రోహిత్ శర్మ అందుబాటులో లేకపోతే… బుమ్రా కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వనున్నారు. ఈ అటు గిల్ ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు. అందుకే మొదటి టెస్ట్ కు దూరం కాబోతున్నానని సమాచారం. గిల్ ఒకవేళ దూరం అయితే అతని స్థానంలో… కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు.
అంతేకాదు గిల్ స్థానంలో తుది జట్టులోకి… జూరేల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అటు తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా మొదటి టెస్ట్ లో అవకాశం రానుందట. ఈ మ్యాచ్.. ద్వారా తన అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. కాగా బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ కు సంబంధించిన జెర్సీలతో… టీమ్ ఇండియా ప్లేయర్లు దిగిన ఫోటోలు తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసింది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">