IRCTC Hyderabad To Shirdi Tour Packages: రీజనబుల్ ఛార్జీలతో దేశంలోని ప్రముఖ పర్యాటక, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు ప్రయాణీకులను తీసుకెళ్లేందుకు IRCTC పలు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొస్తున్నది. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి షిరిడీకి రెండు సూపర్ ప్యాకేజీలను ప్రకటించింది. సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్, సాయి శివం పేర్లతో IRCTC ఈ ప్యాకేజీలను పరిచయం చేసింది. ఇంతకీ ఈ టూర్ ఎన్ని రోజుల పాటు కొనసాగుంది? ప్యాకేజీ ధర ఎంత? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్ ప్యాకేజీ
ఈ టూర్ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా షిరిడీ ఆలయం, శని శింగణాపూర్ ఆలయాలను దర్శించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుంది. 2 నైట్లతో కలిపి 3 రోజులు కొనసాగుతుంది. తొలి రోజు హైదరాబాద్ లో టూర్ ప్రారంభం అవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 6:50 గంటలకు అజంతా ఎక్స్ ప్రెస్ బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడ IRCTC సిబ్బంది పర్యాటకులను రిసీస్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. అక్కడ హోటల్ గదులను అందిస్తుంది. ఆ తర్వాత షిరిడీ ఆలయం దర్శనం ఉంటుంది. అక్కడ నుంచి శని శింగణాపూర్ వెళ్తారు. శని ఆలయం దర్శనం అనంతరం నాగర్‌సోల్‌కు బయల్దేరుతారు. రిటర్న్ జర్నీ నాగర్ సోల్ స్టేషన్ లో రాత్రి 9:20 గంటలకు బయల్దేరుతుంది. మూడో రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరడంతో ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో షిరిడీ దర్శనం, శని శింగణాపూర్, రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటాయి.
టూర్ ప్యాకేజీ ధర
స్టాండర్డ్ క్లాస్(SL)లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.7,120, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 5,430, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5,260గా ధర నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్(3A)లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.8,790, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.7,110, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6,940గా నిర్ణయించారు.
2.సాయి శివం టూర్ ప్యాకేజీ
సాయి శివం టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో షిరిడీ ఆలయం, నాసిక్ చూసే అవకాశం ఉంటుంది. ఈ టూర్ 3 నైట్స్ తో కలిపి 4 రోజులు కొనసాగుతుంది. తొలిరోజు హైదరాబాద్ లో ఈ టూర్ మొదలవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 6:50 గంటలకు అజయంతా ఎక్స్ ప్రెస్ రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు పొద్దున్నే 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ IRCTC సిబ్బంది పర్యాటకులను రిసీస్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. అక్కడ హోటల్ గదులు కేటాయిస్తారు. ఆ తర్వాత షిరిడీ ఆలయానికి తీసుకెళ్తారు. షిరిడీ అంతా చూసి రాత్రి అక్కడే పడుకోవాలి. మూడో రోజు అక్కడి నుంచి త్రయంబకేశ్వర్, పంచవటికి తీసుకెళ్తారు. నాగర్‌సోల్ స్టేషన్ నుంచి రాత్రి 9:20 గంటలకు రైలు తిరుగు ప్రయాణం అవుతుంది. నాలుగో రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో జర్నీ కంప్లీట్ అవుతుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా సందర్శన స్థలాలకు ఏసీ వాహనంలో తీసుకెళ్తారు. బ్రేక్ ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తారు.
టూర్ ప్యాకేజీ ధర
స్టాండర్డ్ క్లాస్‌లో ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే.. సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11,730, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6,550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4,910 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.13,420గా ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,230, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6590గా నిర్ణయించారు.
ఆన్ లైన్ లో టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి?
⦿ IRCTC వెబ్ సైట్ లో Tour Packages మీద క్లిక్ చేయాలి. West India Packages ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి.
⦿ ఆ తర్వాత Sai Sannidhi Ex Hyderabad లేదంటే Sai Shivamలో Book Now ఆప్షన్ పై క్లిక్ చేసి, వివరాలను ఎంటర్ చేసి, టికెట్లు బుక్ చేసుకోవాలి.
Read Also: రైళ్ల బయో టాయిలెట్‌లో రీసైకిల్ చేసిన నీటిని మళ్లీ ప్రయాణికుల అవసరాలకు వాడతారా? ఏది నిజం?