Sobhita Dhulipala: అక్కినేని ఇంట పెళ్లి సందడి మొదలయ్యిపోయింది. అక్కినేని నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల వివాహం త్వరలోనే ఘనంగా జరగనుంది. ఈ ఏడాది ఎంగేజ్ మెంట్ చేసుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్ 4 న ఘనంగా జరగనుంది. ఇప్పటివరకు ఈ డేట్ ను అక్కినేని కుటుంబం కన్ఫర్మ్ చేయలేదు. కానీ రెండు రోజుల నుంచి చై- శోభితాల వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ గా మారింది.
ఇక అందులో కూడా డిసెంబర్ 4 నే పెళ్లి అని రాసి ఉండడంతో అదే రోజు అని ఫిక్స్ అయిపోయారు. డేట్ మాత్రం కాకుండా ప్లేస్ కూడా పిక్స్ చేశారు. N కన్వెన్షన్ కనుక కూల్చకుండా ఉండి ఉంటే అందులోనే వీరి వివాహం జరిగి ఉండేది. అది లేకపోవడంతో అన్నపూర్ణ స్టూడియోస్ లో చై- శోభితా ల వివాహం జరగనుంది.
Pushpa 2 Trailer: అప్పుడు బన్నీ విష్ చేయలేదు, ఇప్పుడు మెగా ఫ్యామిలీ ట్వీట్ చెయ్యలేదు
రెండు రోజుల క్రితం శోభితా ధూళిపాళ్ల శుభలేఖ సోషల్ మీడియాను షేక్ చేసింది. శోభిత పేరు ముందు ఉండి.. చైతన్య పేరు వెనుక ఉండడంతో.. అది పెళ్లి కూతురు తరుపున శుభలేఖ అని తెలుస్తోంది. అందులో వధువు పేరు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శోభితాతో చిరంజీవి చైతన్య వివాహాం డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది అని రాసుకొచ్చారు.
ఇక ఇప్పుడు పెళ్లి కొడుకు తరపు శుభలేఖలో మాత్రం శోభితా పేరు మారింది. అక్కినేని నాగేశ్వరావు- అన్నపూర్ణ.. దగ్గుబాటి రామానాయుడు- రాజేశ్వరి మనవడు అయిన నాగ చైతన్యకు ధూళిపాళ్ల శాంత కామక్షీ- వేణుగోపాల్ రావు కుమార్తె అయిన లక్ష్మీ శోభితాతో డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది అని రాసుకొచ్చారు.
నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు ఇవే..
శోభితా పూర్తీ పేరు లక్ష్మీ శోభితా అన్న విషయం ఎవరికీ తెలియదు. మరి అది అసలు పేరా.. ? లేక చై.. తన అమ్మగారి పేరును శోభితా పేరుకు ముందు పెట్టుకున్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పెళ్ళికి అతిరథమహారథులు ఎవరెవరో వస్తారో చూడాలి.