BigTV English

Director Sujeeth: ఏంటి డైరెక్టర్ గారు.. మీరు చేసిందేమైనా బాగుందా..!

Director Sujeeth: ఏంటి డైరెక్టర్ గారు.. మీరు చేసిందేమైనా బాగుందా..!

Director Sujeeth: సినీ ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు స్టార్ డైరెక్టర్గా త్వరగా గుర్తింపు పొందాలని అహర్నిశలు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. కొండరైతే అయితే ఏకంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ సినిమాలను కొత్త లోకంలోకి తీసుకొని వెళ్తారు. ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు… ఒక సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయిన దానికి పూర్తి బాధ్యత డైరెక్టర్ పైనే ఉంటుంది.. సినిమా సక్సెస్ అయితే మాత్రం అతనికి ప్రశంసలు దక్కుతాయి అదే ఫ్లాప్ అయితే మాత్రం విమర్శలు నెట్టింట ట్రోల్స్ మిగులుతాయి.. ప్రతి సినిమా విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. ఒకప్పుడు సినిమా డైరెక్టర్ అవ్వాలంటే ముందుగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా జాయిన్ అయ్యి అక్కడ పూర్తి వర్క్ నేర్చుకొని ఆ తర్వాత డైరెక్టర్లుగా కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తుంటారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. డైరెక్షన్ గురించి కొంత అవగాహన ఉన్న వాళ్లు కూడా సినిమాలను తీస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా డైరెక్టర్ సుజిత్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది..


ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి వస్తున్న చిత్ర డైరెక్టర్లు షార్ట్ ఫిలింలతో ఫేమస్ అవుతూ డైరెక్ట్ గా ఇండస్ట్రీలకి డైరెక్టర్ గా వచ్చేస్తున్నారు. అందులో భాగంగానే సుజీత్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకొని ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలను చేసే స్థాయికి ఎదిగాడు.. గతంలో ఈయన తీసిన సినిమాలు కొన్ని హిట్ అయితే మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి అయినా కూడా ఆయనకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువగానే వస్తున్నాయి. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్క సినిమాను మిస్ చెయ్యొద్దు..


పవన్ కళ్యాణ్ తో చేస్తున్న సినిమా అనౌన్స్ చేసి మూడేళ్లు అయ్యింది. ఇప్పటికి ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది. అతి తొందర్లోనే ఈ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సుజీత్ ఓజీ సినిమాకి స్టిక్ అయిపోవడం వల్ల ఆయనకు పెద్ద హీరోల నుంచి వస్తున్న ఆఫర్లను సైతం రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఇటీవల తమిళ ఇండస్ట్రీ నుంచి వరుస ఆఫర్స్ వచ్చినా కూడా ఆ సినిమాలకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ సినిమా ఇంకా పూర్తి కాకపోవడంతో ఆ సినిమాని పూర్తి చేసి తర్వాత ఎటువంటి బ్రేక్ లేకుండా కొత్త సినిమాను చేయాలని సుజిత్ ఆలోచిస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యత స్వీకరించడంతో సినిమాలకు కచ్చితంగా డేట్స్ ఇవ్వలేకపోతున్నారు. డేట్స్ ఇవ్వమంటే అదిగో ఇదిగో అని పవన్ కళ్యాణ్ దాటవేస్తున్నాడు తప్ప ఇప్పటివరకు ఏ సినిమాకు డేట్స్ ఇవ్వలేదు అయితే ఇప్పుడు ఓజీ సినిమా కూడా మరింత ఆలస్యం అవుతుందని అభిమానులు నిరాశపడుతున్నారు.. పవన్ డేట్స్ ఇవ్వడం ఇప్పటిలో జరిగేలా లేదు. తమిళ సినిమాలకు ఫిక్స్ అవ్వండి అని కొందరు కామెంట్ చెయ్యగా మరికొందరు మీరు చేసేది అస్సలు బాగోలేదు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అటు పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేయాల్సి ఉంది మరి ఆయన డేట్ ఎప్పుడు ఇస్తాడు ఈ సినిమాలను ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×