BigTV English

Chia Seeds Water: చియా సీడ్స్ కలిపిన నీరు తాగితే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు

Chia Seeds Water: చియా సీడ్స్ కలిపిన నీరు తాగితే.. నమ్మలేనన్ని ప్రయోజనాలు

Chia Seeds Water: చియా సీడ్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. చియా సీడ్స్ తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టిన తర్వాత తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. చియా సీడ్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.


ప్రతి రోజు ఉదయం చియా సీడ్స్ కలిపిన నీరు త్రాగడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. ఇది శరీరం మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది.

నెల రోజులు చియా సీడ్స్ వాటర్ తాగితే.. మీ ఆరోగ్యంలో అనేక ప్రయోజనాలను చూడవచ్చని మీకు తెలుసా. మరి చియా సీడ్స్ కలిపిన నీరు ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో , దానిని ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం.


బరువు తగ్గడంలో సహాయం:
చియా గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా కడుపు చాలా సేపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది క్రమరహిత ఆకలి, అతిగా తినడం వంటి అనేక సమస్యను తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గడంలో కూడా చాలా మేలు చేస్తుంది.

జీర్ణవ్యవస్థ:
చియా సీడ్స్ కలిపిన నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తొలగించి పేగులను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ఇది గ్యాస్, అసిడిటీ ,అజీర్ణం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అజీర్ణం వంటి సమస్యలతో ఇబ్బంది పడే వారు చియా సీడ్స్ కలిపిన నీరు తాగడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.

శక్తి స్థాయి:
చియా సీడ్స్‌లో ఉండే ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఉదయం చియా సీడ్స్ కలిపిన నీరు తాగడం వల్ల మీరు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అంతే కాకుండా ఇది మీ అలసటను తగ్గిస్తుంది. అలసటగా అనిపించినప్పుడు చియా సీడ్స్ కలిపిన నీరు తాగడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి మేలు:
చియా సీడ్స్‌లో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, యాంటీఆక్సిడెంట్లు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. అంతే కాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

చర్మం, జుట్టుకు మేలు:

చియా సీడ్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుస్తాయి. ఇది చర్మం ముడతలు , వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రోటీన్లు , ఒమేగా-3 జుట్టును బలంగా ,మెరిసేలా చేస్తాయి. చర్మం తాజాగా మెరుస్తూ ఉండాలంటే చియా సీడ్స్ కలిపిన నీరు తాగడం చాలా మంచిది.

మధుమేహ నియంత్రణ:
చియా సీడ్స్ కలిపిన నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉండే ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. అంతే కాకుండా ఇది డయాబెటిక్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మీ ఎముకలను బలంగా చేసుకోండి:
చియా సీడ్స్‌లో కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చియా సీడ్స్ క్రమం తప్పకుండా తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది.

Also Read: ముఖానికి ఐస్ రుద్దితే.. ఎన్ని లాభాలుంటాయో తెలుసా ?

రోగనిరోధక శక్తిని పెంచడం:
చియా సీడ్స్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. అంతే కాకుండా ఇవి ఇన్ఫెక్షన్లు , వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. చియా సీడ్స్ ఉండే మెగ్నీషియం ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మనసును ప్రశాంత పరుస్తుంది. అంతే కాకుండా మంచిగా నిద్ర పొందడానికి సహాయపడుతుంది.

చియా విత్తనాల నీటిని ఎలా తయారు చేయాలి ?
చియా గింజల నీటిని తయారు చేయడానికి.. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ చియా గింజలను వేసి 10-15 నిమిషాలు నానబెట్టండి. తర్వాత బాగా కలిపి త్రాగాలి. రుచి కోసం నిమ్మరసం లేదా తేనె కూడా కలుపుకోవచ్చు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×