BigTV English

Sukumar: ఆయనతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను ఇప్పుడు స్టేజ్ షేర్ చేసుకున్నాను

Sukumar: ఆయనతో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను ఇప్పుడు స్టేజ్ షేర్ చేసుకున్నాను

Sukumar:  ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో సుకుమార్ ఒకరు. ఆర్య సినిమాతో దర్శకుడుగా ప్రయాణాన్ని మొదలుపెట్టిన సుకుమార్ ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులందరి కంటే సుకుమార్ కొంచెం ప్రత్యేకం. ఈ రోజుల్లో ఒక దర్శకుడు దగ్గర పని చేసిన సహాయ దర్శకులు డైరెక్టర్లు అయ్యే దాఖలాలు చాలా తక్కువ. కానీ సుకుమార్ దగ్గర పని చేసిన ఎక్కువమంది స్వతహాగా దర్శకులుగా తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. కేవలం ప్రూవ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటున్నారు. సుకుమార్ ఫెయిల్యూర్ కి కూడా ఒక డిగ్నిటీ ఉంటుంది. తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.


ఎక్స్ట్రార్డినరీ జర్నీ 

ప్రస్తుతం దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకున్న సుకుమార్ ఒకప్పుడు రచయితగా కూడా ఎన్నో సినిమాలకు వర్క్ చేశారు. అలానే అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. సుకుమార్ విషయానికొస్తే తన జర్నీ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దిల్ సినిమాకి రచయితగా పనిచేశాడు సుకుమార్. నితిన్ నటించిన లై సినిమాకు అదే సుకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రకాష్ రాజు నటించిన క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాకు రచయితగా వర్క్ చేశారు. అదే ప్రకాష్ రాజ్ తీసిన మన ఊరి రామాయణం సినిమాకి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఇక రీసెంట్ గా సీతా పయనం అని సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా హీరోలు ఈవెంట్ కు అర్జున్ సర్జ మరియు ఉపేంద్ర హాజరయ్యారు. అయితే సుకుమార్ హనుమాన్ జంక్షన్ కి పనిచేసిన రోజులు గుర్తు చేసుకున్నారు.


ఆయనను చూస్తే గౌరవం ఇవ్వాలనిపిస్తుంది 

అర్జున్ గారు చేసిన హనుమాన్ జంక్షన్ సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను. ఆయన సెట్లోకి వస్తున్నప్పుడు చాలా పీస్ ఫుల్ గా ఉండేది. నేను అతనిని చాలా దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. సీన్ విషయంలో చాలా డెడికేటెడ్ గా ఉండేవాళ్ళు. అయితే అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అదే బాడీ లాంగ్వేజ్ తో ఉన్నారు. ఇప్పుడు ఈయనతో పాటు కూర్చొని ఈ స్టేజ్ పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది అని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్గా పుష్ప సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ ప్రస్తుతం పుష్ప 3 స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు. దానికంటే ముందు సుకుమార్ రామ్ చరణ్ తేజ్ తో మరో సినిమాను చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు.

Also Read : ‘ఓజీ’కి మళ్లీ బ్రేకులు? ఒక వైపు డెంగ్యూ మరోవైపు వరదలు.. వాయిదా తప్పదా?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×