Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో మరొక వీకెండ్ ఎపిసోడ్ మొదలయ్యింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. గతవారంలో అందరి మద్దతుతో ప్రేరణ మెగా చీఫ్ అయ్యింది. తను మెగా చీఫ్ అవ్వడం పక్కన పెడితే.. దానివల్లే హౌస్‌లో, స్నేహితుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా మెగా చీఫ్‌గా అధికారం రాగానే తనకు సపోర్ట్ చేసిన వారిని కూడా మర్చిపోయింది ప్రేరణ. ప్రస్తుతం ప్రేరణ.. యష్మీకి మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే ఎవిక్షన్ షీల్డ్ టాస్కులో యష్మీ చేసిన పనిని ఎవ్వరూ ఏమనలేదు. కానీ టేస్టీ తేజపైనే ఎఫెక్ట్ పడింది. ఆఖరికి నాగార్జున వచ్చి కూడా టేస్టీ తేజనే నిందించారు.
టేస్టీ తేజపై ఫైర్
‘‘ఎవిక్షన్ షీల్డ్ గురించి టాస్కులో హౌస్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి’’ అని ప్రోమో మొదలవ్వగానే నాగార్జున అన్నారు. దీంతో టేస్టీ తేజ ఏం మాట్లాడకుండా లేచి నిలబడ్డాడు. దీంతో ‘‘టాస్క్ రూల్స్ తెలియవా? ఎందుకలా చేశావు’’ అంటూ తనను ప్రశ్నించారు నాగ్. టేస్టీ తేజ, యష్మీ మొండిగా ఉండకపోయింటే నిఖిల్, నబీల్, రోహిణిలో ఎవరో ఒకరికి ఎవిక్షన్ షీల్డ్ వచ్చేది. అందుకే తాను ఎందుకలా చేశాడో వివరించాడు తేజ. ‘‘ఈ ముగ్గురిని ఎవిక్షన్ షీల్డ్ గురించి ప్రత్యేకంగా అడిగాను’’ అని చెప్తుండగానే.. ‘‘నేను దాని గురించి అడగలేదు. అసలు టాస్క్ ఏంటి?’’ అని మళ్లీ అడిగారు నాగార్జున. ‘‘నేను యష్మీని ఒప్పించడానికి ప్రయత్నించాను కానీ తను అదే మాట మీద ఉంది’’ అని గుర్తుచేశాడు తేజ.
Also Read: తలకిందులైన బిగ్ బాస్ ఓటింగ్.. డేంజర్ జోన్ లో వారే..!
వచ్చేవారం ఏం జరగబోతుంది
‘‘మరీ మీ ఇద్దరూ ఒక మాటపైకి రాకుండా ఒక్కడివే ఎందుకు ఆడావు? నువ్వు చేసిన తప్పుకు పరిణామం ఏంటో తెలుసా? వచ్చేవారం’’ అంటూ నాగార్జున చెప్పిన మాటలను ప్రోమోలో మ్యూట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే వచ్చేవారం టేస్టీ తేజకు ఏదో పనిష్మెంట్ రాబోతుందని అర్థమవుతోంది. ఇక ఎవిక్షన్ షీల్డ్ టాస్క్ సరిగా పూర్తి కాలేదు కాబట్టి ఇప్పుడు నాగార్జున.. దానిని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. నబీల్, నిఖిల్, రోహిణిలో ఎవరికి ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వాలనుకుంటున్నారో కంటెస్టెంట్స్‌ను నిర్ణయించమన్నారు. ఒక్కొక్క కంటెస్టెంట్ ముందుకొచ్చి ఈ ఎవిక్షన్ షీల్డ్ ఎవరికి దక్కాలని అనుకుంటున్నారో వారిని ఒక అడుగు ముందుకు జరపమన్నారు.
అందరూ సమానం
ముందుగా వచ్చిన అవినాష్.. ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడో చెప్పకుండా సేఫ్ సమాధానం చెప్పడానికి ప్రయత్నించాడు. దీంతో నాగార్జున తనను మధ్యలోనే ఆపేశారు. ప్రేరణ వచ్చి రోహిణికి ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వాలంటూ తనను ముందుకు జరిపింది. ‘‘స్వార్థం లేకుండా, పక్షపాతం చూపించకుండా తను షీల్డ్‌కు న్యాయం చేస్తుంది’’ అంటూ కారణం చెప్పుకొచ్చింది. హరితేజ వచ్చి నిఖిల్‌కు సపోర్ట్ చేసింది. అప్పుడే తన రివెంజ్ స్టోరీ స్టార్ట్ అనే స్టేట్‌మెంట్‌ను గుర్తుచేశారు నాగ్. అది నబీల్ గురించి అని చెప్పగానే.. ‘‘పగ గురించి తెలియదు కానీ బుస కొడతాడు’’ అంటూ నాగ్ కూడా నబీల్‌పై కౌంటర్ వేశారు. ఇక ముగ్గురు కంటెస్టెంట్స్‌కు సమానంగా సపోర్ట్ రావడంతో ఎవరికి ఎవిక్షన్ షీల్డ్ దక్కాలి అనే నిర్ణయం మెగా చీఫ్ ప్రేరణ చేతికి వెళ్లింది.