BigTV English

Spirit Movie : స్పిరిట్ పై ఆశలు వదులుకోవాల్సిందేనా..? రూటు మార్చిన వంగా..

Spirit Movie : స్పిరిట్ పై ఆశలు వదులుకోవాల్సిందేనా..? రూటు మార్చిన వంగా..

Spirit Movie : స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరసగా ప్లాన్ ఇండియా సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. ఈయన ప్రతి ఏడాది అరడజనుకు పైగా సినిమాలని అనౌన్స్ చేస్తుంటాడు. కాకపోతే ఒక్క సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తుంటాడు. గ తేడాది నాలుగు సినిమాలను అనూషగా అందులో కల్కే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రభాస్ నటించిన ఒక్క సినిమాని థియేటర్లలోకి రాబోతుందన్న విషయం తెలిసిందే. ప్రభాస్ చేస్తున్న సినిమాలలో స్పిరిట్ కూడా ఒకటి.. ఈ సినిమా అనుకున్నట్లు జరిగింటే ఈపాటికి సగం షూటింగ్ వరకే పూర్తయ్యేది. కానీ ప్రభాస్ వల్ల లేట్ అవుతుందని అందుకే మరో సినిమాకి డైరెక్టర్ సందీప్ రెడ్డి షిఫ్ట్ అవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..


స్పిరిట్ ను పక్కన పెట్టేసిన వంగా మామ..

ప్రభాస్ నటించిన సినిమాలలో స్పిరిట్ కూడా ఒకటి.. ఈ సినిమాలో డార్లింగ్ పోలీస్ పాత్రలో కనిపించబోతాడు అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు మొదలవుతుందా అని డార్లింగ్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు.. కానీ ప్రభాస్ కమిటీ అయిన సినిమాలను చూస్తుంటే ఇప్పట్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేలా కనిపించలేదు. దాంతో సందీప్ రెడ్డి వంగ మరో సినిమాని చేయబోతున్నాడు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నిజానికి ప్రభాస్ కోసం తన టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకన్నట్టుగా భావిస్తున్నాడట. తన డైరెక్షన్ లో సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసే సందీప్ ప్రభాస్ ని ఒక ఏడాది తనకు టైం ఇవ్వాలని అడిగాడట.. దానికి తగ్గట్లే ప్రభాస్ కూడా ఏడాది పాటు టైం ఇచ్చాడట..


అయితే, ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ మూవీని చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఇంకాస్త పెండింగ్ ఉండడంతో దీని త్వరగా పూర్తిచేసి, హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజీని పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట డార్లింగ్.. ఈ రెండు సినిమాలు పూర్తయ్యలోగా ఎలా లేదనుకున్నా ఏడాది సమయం పడుతుంది కాబట్టి డైరెక్టర్ వంగా మరో హీరోతో మూవీని చేస్తాడని మీడియా వర్గాల్లో కోడై కూస్తుంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియలేదు కానీ ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. దీనిపై ప్రభాస్ లేదా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే..

ప్రభాస్ సినిమాల విషయానికొస్తే..

టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలని క్రియేట్ చేస్తున్నాయి.. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి డైరెక్షన్ లో చేస్తున్న ఫౌజీ కూడా షూటింగ్ జరుపుకుంటుంది.. ఆ తర్వాత స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. సలార్ 2, కల్కి 2 కూడా చేయాల్సి ఉంది. వీటితో పాటు ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో దిల్ రాజు సినిమా కూడా లైన్ లో ఉంది.. అయితే ఈ సినిమాలన్నిటిని ఎప్పుడు పూర్తి చేస్తాడు? ఎప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×