E-Paper
Advertisement

Natti Kumar: టాలీవుడ్ పెద్దల భేటీ.. నట్టి కుమార్ బాధ ఏంటి ?

Natti Kumar: టాలీవుడ్ పెద్దల భేటీ.. నట్టి కుమార్ బాధ ఏంటి  ?
Advertisement

Natti Kumar: టాలీవుడ్ పెద్దలు  జూన్ 15 న ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న సంగతి తెల్సిందే. గత కొన్నిరోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న  సంఘటనల గురించి ఏపీ ప్రభుత్వంతో చర్చించనున్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధితో పాటు.. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను కూడా ఏకరువు పెట్టనున్నారు. ఈ సమావేశానికి ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ సారథ్యం వహించనున్నారు. జూన్ 15 న టాలీవుడ్ లోని పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు, నటులు మొత్తం కలిసి 52 మంది ఈ భేటీలో పాల్గొననున్నారని తెలుస్తోంది. అయితే అందరూ పెద్ద పెద్దవారిని తప్ప చిన్న సినిమాల నిర్మాతలను పిలవడం లేదని, ఈ భేటీకి తనకు ఆహ్వానం రాలేదని నిర్మాత నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు.

పవన్ కళ్యాణ్ అందరినీ సమానంగాగా పిలవమని కోరినా సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం కొందరిని మాత్రమే ఆహ్వానించడాని వాపోయాడు. అందరి కంటే ఎక్కువ తమలాంటి సినిమా నిర్మాతలకే ఎక్కువ సమస్యలు ఉన్నాయని, దయచేసి తమ డిమాండ్లను కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరుతూ నట్టి కుమార్.. ఏపీ ప్రభుత్వానికి బహిరంగంగా లేక రాశాడు. ఈ లేఖలో తాము ఎదుర్కుంటున్న సమస్యలకు పరిష్కారం తెలపాలని కోరాడు. “నేను నట్టి కుమార్, తెలుగు సినీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ, మాజీ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్, తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, ఫిలిం డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్..

Advertisement

గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎంల ఆధ్వర్యంలో 15-06-2025వ తేదీన (ఆదివారం) తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయడం శుభపరిణామం. అయితే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కల్యాణ్ గారు దాదాపు పదిరోజుల క్రితం మాట్లాడిన మాటల్లో ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో మాత్రమే ప్రభుత్వాన్ని కలవాలని చెప్పారు. అలా వారు చెప్పడం మా అందరిలో చాలా సంతోషాన్ని కలిగించింది. కానీ ఆ తర్వాత ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ జరిగిందో తెలియదు కానీ డైరెక్ట్ గా సినిమాటోగ్రఫీ మంత్రి కొందరు సినీ పరిశ్రమ పెద్ద సినిమాల వాళ్ల పేర్లను మాత్రమే ఆదివారం మీటింగ్ కు 52 మందిని ఆహ్వానించడం జరిగింది. ఈ పిలుపులో పెద్ద నిర్మాతలు , పెద్ద డైరెక్టర్స్ , పెద్ద హీరోలు తప్ప చిన్న చిత్రాల నిర్మాతలకు ప్రాతినిధ్యమే లేకపోవడం బాధాకరమైన విషయం.

చిన్న చిత్రాల నిర్మాతల సమస్యలు ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే, తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చిన్న చిత్రాల నిర్మాతలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా చిన్న చిత్రాల నిర్మాతలు సుదీర్ఘంగా విజ్ఞప్తి చేస్తున్నది తమరి దృష్టికి తీసుకుని వస్తున్నాను. దయచేసి పెద్ద మనసుతో చిన్న చిత్రాల నిర్మాతల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తిగా తమరికి మనవి చేస్తున్నాను.

Advertisement

సినిమా థియేటర్లలో 5 (ఐదు) షోలకు సంబంధించి, మధ్యాహ్నం 2-30 గంటల షోను తప్పనిసరిగా చిన్న చిత్రాలకు కేటాయించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో పెండింగ్ లో ఉన్నది. 175 స్క్రీన్స్ లోపు రిలీజ్ చేసే చిన్న చిత్రాలకు 2-30 గంటల షోను కేటాయించామని పోరాటం జరుగుతూనే ఉంది.

అలాగే మల్టీఫ్లెక్స్ లలో సీటింగ్ కెపాసిటీ లో 20% ఆక్యుపెన్సీ టిక్కెట్ ధరను 75/- రూపాయలుగా నిర్ణయిస్తూ, జీవో ఉన్నప్పటికీ, దానిని ఎవరూ అమలు పరచడం లేదు. ముఖ్యంగా ఈ రెండు సమస్యలు పరిష్కారం కావాలన్నది చిన్న చిత్రాల నిర్మాతల కల. వాస్తవానికి చిత్ర పరిశ్రమలో ఏడాదికి సరాసరి 200 సినిమాలు నిర్మాణం అయితే అందులో 150 వరకు చిన్న సినిమాలే ఉంటాయన్నది అందరికీ తెలిసిందే. చిన్న చిత్రాలను ఆధారం చేసుకుని ఎంతోమంది సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులు, కార్మికులు జీవనం సాగిస్తున్నారు. కానీ చిన్న చిత్రాల నిర్మాతల సమస్యలు మాత్రం అలాగే మిగిలి ఉన్నాయి. వీటిని పరిశీలించవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇక ఆదివారం ఆంధ్ర ప్రదేశ్ లో జరగబోయే మీటింగ్ కు వస్తున్న సినీ పెద్దలకు 35 శాతం సినిమా షూటింగ్ తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లోనే జరపాలని తమరు ఆదేశించాలని కోరుతున్నాను వాస్తవానికి ఏపీ నుంచి సినిమా రెవిన్యూ 68 శాతం పరిశ్రమకు లభిస్తే, 32 శాతం నైజాం నుంచి లభిస్తోంది. ఈ విషయాన్ని మీరు పరిగణలోనికి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అలాగే ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ, అలాగే టూరిజం అభివృద్ధి చెందాలంటే infrastructure అభివృద్ధి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. GST లను కూడా ఆంధ్రప్రదేశ్లోనే కట్టేవిధంగా సినీ పెద్దలకు సూచించాలని తమరిని కోరుతున్నాను. వీటివల్ల ఎంప్లాయిమెంట్ పెరుగుతుంది. ఏపీకి చెందిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, అలాగే సినీపరిశ్రమ, చిన్న చిత్రాల నిర్మాతలకు మేలు జరగాలన్న సదాశయంతో ఈ విజ్ఞాపన పత్రాన్ని తమరికి రాయడం, మీ దృష్టికి తేవడం జరుగుతోంది” అంటూ  తన ఆవేదనను వెళ్లగక్కాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ లేఖలోని అంశాలను ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×