Disha Patani: మామూలుగా ఒక స్టార్ హీరోతో ఒక్కసారి నటించడమే చాలా అదృష్టంగా భావిస్తుంటారు హీరోయిన్స్. అలాంటి ఒకే పాన్ ఇండియా హీరోతో మళ్లీ మళ్లీ నటించే ఛాన్స్ దొరికితే ఎలా ఉంటుంది. తాజాగా దిశా పటానీ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పటికే ప్రభాస్‌తో ఒక సినిమాలో నటించి మెప్పించింది దిశా పటానీ. అసలు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ వైపే చూడని దిశాకు ప్రభాస్‌తో మరోసారి నటించే అవకాశం లభించింది. దీంతో ఈ అమ్మడి అదృష్టం మామూలుగా లేదని తెలుగు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఎన్నో సినిమాలు ఉండగా.. దిశా పటానీ తనతో మరోసారి జోడీకడుతున్న మూవీ ఏంటి అని అందరిలో సందేహం మొదలయ్యింది.
మరోసారి ప్రభాస్‌తో
మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి దిశా పటానీ. అదే సమయంలో ఎన్నో యాడ్స్ చేసింది. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని హైలెట్ అయ్యింది. కానీ తనను హీరోయిన్‌గా మార్చడానికి బాలీవుడ్ మేకర్స్ ముందుకు రాలేదు. టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ అయిన పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ‘లోఫర్’ అనే మూవీతోనే మొదటిసారి హీరోయిన్‌గా మారింది దిశా. ఆ తర్వాత తనకు హిందీలో అవకాశాలు మొదలయ్యాయి. ‘లోఫర్’ ఫ్లాప్ అవ్వడంతో అప్పటినుండి దిశా పటానీకి మరొక తెలుగు సినిమాలో అవకాశం రాలేదు. కానీ చాలాకాలం తర్వాత నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ లాంటి పాన్ ఇండియా మూవీలో ప్రభాస్‌తో జోడీకట్టే అవకాశం కొట్టేసింది.
తెలుగు సినిమాలో
‘కల్కి 2898 ఏడీ’లో దిశా పటానీ (Disha Patani) ఉండేది కాసేపే అయినా అందులో ప్రభాస్‌తో తన కెమిస్ట్రీ బాగుందని చాలామంది ప్రేక్షకులు ఫీలయ్యారు. తను సినిమాకు ఒక గ్లామర్ యాడ్ చేసిందని, ఇంకాసేపు స్క్రీన్‌పై ఉండే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో తన పాత్ర ఇంకాసేపు ఉంటుందేమో అని ఆశిస్తున్నారు. ఇంతలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరొక సినిమాలో దిశా పటానీ హీరోయిన్‌గా అవకాశం కొట్టేసిందట. ప్రస్తుతం ప్రభాస్ ఒక సినిమా కాకుండా ఒకేసారి చాలా సినిమాలపై దృష్టిపెట్టాడు. అందులో ‘ఫౌజీ’ కూడా ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ‘ఫౌజీ’లో దిశా పటానీ హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.
Also Read: ఏంటీ నిజంగానే త్రిష, నయనతార మధ్య శత్రుత్వం ఉందా.?
సెకండ్ హీరోయిన్
హను రాఘవపూడి, ప్రభాస్ (Prabhas) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ (Fauji)లో ఇప్పటికే ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్‌గా ఎంపికయ్యింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఫాలోయింగ్‌ను పెంచుకున్న ఇమాన్వి.. ‘ఫౌజీ’తో ఒక్కసారిగా ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇమాన్వి మాత్రమే కాకుండా ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉంటుందని, దానికి దిశా పటానీ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఈ వార్తలే నిజమయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన హీరోయిన్‌గా దిశా పటానీ రికార్డ్ క్రియేట్ చేసినట్టే అనుకుంటున్నారు ఫ్యాన్స్.