Divi Vadthya: లంబసింగి సినిమాతో అభిమానులను అలరించిన హీరోయిన్ అందరికీ తెలుసుగా.. అదేనండీ హైట్ కు తగ్గ అందంతో మరిపించే అందాల ముద్దుగుమ్మ దివి వడ్త్యా. టాలీవుడ్ లో అందరూ ముద్దుగా దివి అని పిలుచుకుంటారు. ప్రస్తుతం ఈమె చేసిన ఓ కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే..
ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా సెలబ్రిటీలపై కామెంట్స్ చేయడాన్ని ఇక సాధారణంగా తీసుకోవడం లేదు. తాజాగా తెలుగు నటిగా పేరు తెచ్చుకున్న దివి ఓ ట్రోలర్‌కి పాడు పదాన్ని ఉపయోగించి మరీ కామెంట్ చేసింది. ఓ నెటిజన్ చేసిన అశ్లీల వ్యాఖ్యకు దివి కూడా ఆ స్థాయిలోనే బదులివ్వడంతో సోషల్ మీడియా చర్చల మయమైంది.
ఏం జరిగిందంటే..?
దివి తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేయగా, ఒక నెటిజన్ దానిపై అశ్లీలంగా కామెంట్ చేశాడు. ఈ అందానికి ఆమె అది తాగేందుకు కూడా సిద్ధమని ఆ నెటిజన్ కామెంట్స్ చేశాడు. ఇది కాసేపటికి ఆమె దృష్టికి వెళ్లింది. సైలెంట్‌గా వదిలేయకుండా, ఆ వ్యక్తిని ట్యాగ్ చేస్తూ దివి కూడా ఘాటు రిప్లై ఇచ్చింది. రేయ్ బాబు నువ్వు అది కూడా తింటావా ఏమి అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ తో దిమ్మ తిరిగేలా స్పందించింది.
నెటిజన్ల స్పందన
దివి రియాక్షన్‌పై నెటిజన్లలో విభిన్న స్పందన వ్యక్తమవుతోంది. కొందరు “చాలా బాగా సమాధానం చెప్పింది” అని సపోర్ట్ చేస్తే, మరికొందరు “నీవే ఫాలోవర్స్ కోసం ఇలాంటి ఫొటోలు పెడతావ్” అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఎక్కువ మంది దివి వైపు నిలిచారు. మహిళలపై ఎవరైనా ఈ రీతిలో కామెంట్స్ చేయడం తగదన్నది వారి అభిప్రాయం.
దివి ఎప్పటికప్పుడు..
ఇలాంటి సందర్భాల్లో మౌనం కాకుండా ఎదురు నిలిచే దివి, ఈ ఘటనకూ మినహాయింపు కాదు. గతంలోనూ కొన్ని సందర్భాల్లో ఆమె తన అభిప్రాయాన్ని ధైర్యంగా వెల్లడించింది. ఇప్పుడు కూడా అదే ధైర్యంతో స్పందించిందని ఆమె అభిమానులు చెబుతున్నారు.
Also Read: BIG BREAKING: ఆపరేషన్ సిందూర్.. ఓటీటీలకు కేంద్రం కీలక ఆదేశాలు, అవి అపేయండి
చివరకు..
ఇన్‌స్టాగ్రామ్ ట్రోలర్‌కి దివి ఇచ్చిన ఘాటు రిప్లై నెట్టింట్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అన్నది మరోసారి రుజువైంది. చెత్త కామెంట్స్ చేసిన నెటిజన్ కూడా ఈ దెబ్బకు దడుసుకొని ఉండవచ్చు. ఎందుకంటే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మొత్తం మీద సోషల్ మీడియాలో ఇష్టారీతిన కామెంట్స్ చేసే వారికి ఇదొక గుణపాఠమని కొందరు తమ అభిప్రాయం అంటున్నారు.