BigTV English

HYDRA POLICE STATION: హైడ్రా పీఎస్ ఏర్పాటైంది.. ఇక వారి భరతం పట్టుడే: సీఎం రేవంత్

HYDRA POLICE STATION: హైడ్రా పీఎస్ ఏర్పాటైంది.. ఇక వారి భరతం పట్టుడే: సీఎం రేవంత్

HYDRA POLICE STATION: తెలంగాణలో హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. మంత్రులు, అధికారులతో కలిసి ఈ రోజు బుద్ధ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ పరిరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేసిందని సీఎం వ్యాఖ్యానించారు.


‘హైడ్రా విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశాం. 1908 లో వచ్చిన వరదలు నిజాం ప్రభుత్వాన్ని కదిలించాయి. ఆనాడు వరదల నివారణకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిజాం నిర్మించారు. మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆలోచనతోనే హైడ్రాను తీసుకొచ్చాం. బెంగుళూరులో చెరువులను పరిరక్షించుకోకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. ముంబై, చెన్నై వరదలతో సతమతమవుతున్న పరిస్థితి ఉంది.  కాలుష్యాన్ని నియంత్రించక పోవడంతో ఢిల్లీలో పార్లమెంట్ నుంచి పాఠశాల వరకు సెలవులు ప్రకటిస్తున్నారు. మెట్రో నగరాలు నివసించడానికి యోగ్యం కాని నగరాలుగా మారుతున్నాయి’ అని సీఎం అన్నారు.

‘ప్రకృతిని కాపాడుకోకపోతే హైదరాబాద్ లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. అందుకే ఎవరేం అనుకున్నా హైడ్రాను తీసుకొచ్చాం. చెరువులు ఆక్రమిస్తే ఎంతటివారినైనా హైడ్రా ఉపేక్షించదు. హైదరాబాద్ లో చిన్న వర్షం వస్తే కాలనీలకు కాలనీలే మునిగిపోతున్నాయి. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలే కాదు. రోడ్డుపై నీరు నిలవకుండా, విద్యుత్ పునరుద్ధరణ జరిగేలా, వర్షాలు పడిన సమయంలో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేసే బాధ్యతను హైడ్రా చూసుకుంటోంది. నగరంలో చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురయ్యాయి. కొందరు రోడ్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టారు. వీటిని నియంత్రించాల్సిన అవసరం లేదా? నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యంగా వదిలేద్దామా? అందుకే హైడ్రాను ఏర్పాటు చేసుకున్నాం’ అని సీఎం వ్యాఖ్యానించారు.


‘హైడ్రా ద్వారా చెరువులను కాపాడి వాటిని పునరుద్ధరిస్తున్నాం. చెరువులను , నాలాలను, మూసీని ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే కోపం. అలాంటి కొంతమంది మా నిర్ణయాలను వ్యతిరేకించినా… ప్రజలకోసం మేం వెనక్కి తగ్గేది లేదు. పునరుద్ధరించుకుంటాం అంటే కొందరికి బాధ గా ఉంది. ప్రకృతిని కాపాడుతామంటే కొందరికి దుఃఖం వస్తుంది. ఆక్రమణలు తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుందని మాట్లాడుతున్నారు. అసలు మీ బాధ ఏంటి..? వాళ్ళు కడుపు నిండా విషం నింపుకుని ప్రభుత్వాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ప్రజలకు మేలు జరగొద్దని చూస్తున్నారు.

Also Read: IOCL Recruitment: పదితో ఐవోసీఎల్‌లో 1770 ఉద్యోగాలు.. స్టైఫండ్ కూడా ఇస్తారు.. లాస్ట్ డేట్?

‘గుజరాత్ లో సబర్మతి, యూపీలో గంగా నది, ఢిల్లీలో యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేసుకుంటున్నారు. కానీ మేం మూసీని పునరుద్ధరణ చేస్తామంటే అడ్డుకుంటున్నారు. బీజేపీ నాయకులు చేస్తే కరెక్టు.. తెలంగాణలో కాంగ్రెస్ చేస్తే తప్పా…? నాపై కక్ష ఉంటే నాపై చూపండి.. ప్రజలకు మేలు జరిగే పనులను అడ్డుకోవద్దు. వారసత్వ సంపదను కాపాడుకుని నగరాన్ని పునరుద్ధరించుకుందాం. హైడ్రా అధికారులకు నా సూచన ఏంటంటే.. పేదల పట్ల మానవీయ కోణంతో, సానుభూతితో వ్యవహరించండి. పేదలకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. భారీ తప్పులు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించండి’

Related News

TGSRTC Dasara Offer: బస్సెక్కితే బహుమతులు.. దసరాకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్

Hyderabad Metro: రేవంత్ సర్కార్ చేతికి మెట్రో తొలి దశ ప్రాజెక్ట్.. రూ.13వేల కోట్లను టేకోవర్ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

TGPSC Group-1: గ్రూప్-1 ఉద్యోగం సాధించిన వారికి శుభవార్త.. ఈ 27న సీఎం చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్

Weather News: నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరిక.. పిడుగులు పడే ఛాన్స్

Ganja Seized: గచ్చిబౌలిలో భారీగా గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

CM Revanth Reddy: భారీ వర్షాలున్నాయి.. అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్రెడ్డి ఆదేశం

Hydra Commissioner: మంత్రి కొండా సురేఖతో.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ భేటీ..

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Big Stories

×