BigTV English

Divya Dutta: తన గురించి ఎవరు ఏమనుకున్నా అనవసరం.. రష్మికకు సపోర్ట్‌గా బాలీవుడ్ నటి కామెంట్స్

Divya Dutta: తన గురించి ఎవరు ఏమనుకున్నా అనవసరం.. రష్మికకు సపోర్ట్‌గా బాలీవుడ్ నటి కామెంట్స్

Divya Dutta: హీరో, హీరోయిన్లకు ఎంత పాపులారిటీ, ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా వారిపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారు కూడా ఉంటారు. పాజిటివ్ కామెంట్స్‌తో పాటు వారిపై వచ్చే నెగిటివిటీని కూడా భరించక తప్పదు. అలా పాన్ ఇండియా హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందనాపై కూడా ప్రేక్షకులు ఎప్పటికప్పుడు నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా సౌత్ వదిలేసి బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత రష్మికపై నెగిటివ్ కామెంట్స్ మరింత ఎక్కువయ్యాయి. తాజాగా విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘ఛావా’లో మరాఠా సామ్రాజ్యపు మహారాణిగా నటించింది రష్మిక. ఈ పాత్రలో తను అస్సలు సెట్ అవ్వలేదని ప్రేక్షకులు నెగిటివ్ కామెంట్స్ చేస్తుండడంతో తనకు సపోర్ట్‌గా ఒక నటి నోరువిప్పింది.


సపోర్ట్‌గా వ్యాఖ్యలు

ఛత్రపతి సాంబాజీ మహారాజ్ బయోపిక్‌గా తెరకెక్కిన సినిమానే ‘ఛావా’. ఇందులో సాంబాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించగా.. తన భార్య యేసుబాయ్ పాత్రలో రష్మిక మందనా (Rashmika Mandanna) నటించింది. యేసుబాయ్ ఒక మరాఠా మహారాణి. అలాంటి మహారాణి పాత్రకు సౌత్ నటి అయిన రష్మిక మందనాను ఎంపిక చేశాడు దర్శకుడు లక్ష్మణ్ ఉతేకర్. సౌత్ హీరోయిన్ అవ్వడంతో మరాఠీలో డైలాగ్స్ సరిగ్గా చెప్పలేకపోయిందని, ఎవరైనా మరాఠీ అమ్మాయిని ఈ పాత్ర కోసం ఎంపిక చేసుంటే బాగుండేదని చాలామంది ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా తనపై చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు. అది ‘ఛావా’లో మరొక ముఖ్య పాత్రలో నటించిన దివ్య దత్తాకు నచ్చలేదు.


కాటుక కళ్లతో మాయ

‘‘కొన్ని సీన్స్‌లో రష్మిక కాటుక కళ్లను చూస్తే కట్టిపడేస్తాయి. తను ఎన్నో హిట్స్ ఇచ్చిందనే విషయం మర్చిపోకుండా ఉంటే మంచిది. అన్ని హిట్స్ ఉన్నాయంటే తనకు ఆడియన్స్‌పై ఎంత పట్టు ఉందో అర్థమవుతోంది. నాకు తెలిసిన దాన్ని బట్టి తను చాలా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. చాలా మంచి మనిషి. తను నాకు చాలా నచ్చుతుంది. వేరేవాళ్లు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం’’ అని చెప్పుకొచ్చింది దివ్య దత్తా (Divya Dutta). ‘ఛావా’లో దివ్య దత్తా, రష్మిక మందనా కలిసి యాక్ట్ చేసిన సీన్స్ ఏమీ లేవు. ఇద్దరు పూర్తిగా వేర్వేరు పాత్రల్లో కనిపించారు. అయినా కూడా తను రష్మిక గురించి గొప్పగా మాట్లాడడం, తనకు సపోర్ట్ చేయడం చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

Also Read: ఆ సినిమా అందరికీ నచ్చదు.. సొంత మూవీపై రీతూ వర్మ షాకింగ్ స్టేట్‌మెంట్

మౌత్ టాక్‌తో హిట్

ఫిబ్రవరి 14న ‘ఛావా’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీని కేవలం హిందీలో మాత్రమే ప్రమోట్ చేసి, కేవలం ఆ భాషలో మాత్రమే విడుదల చేశారు మేకర్స్. అయినా కూడా ఇతర రాష్ట్రాల్లో కేవలం మౌత్ టాక్‌తో దూసుకుపోతోంది ‘ఛావా’ (Chhaava). ఈ సినిమా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం విక్కీ కౌశల్ యాక్టింగ్ అని ప్రేక్షకులంతా తనను తెగ ప్రశంసిస్తున్నారు. తన సినిమాల రికార్డులను తానే బ్రేక్ చేసుకుంటూ ‘ఛావా’ను ఒక స్థాయిలో నిలబెట్టగలిగాడు విక్కీ. ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.249.31 కోట్లు సాధించింది. ఇప్పటికీ చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×