E-Paper
Advertisement

IND vs PAK: టీమిండియా, పాక్ మ్యాచ్ ఉచితంగా ఎలా చూడాలి… ?

IND vs PAK: టీమిండియా, పాక్ మ్యాచ్ ఉచితంగా ఎలా చూడాలి… ?
Advertisement

IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( ICC Champions Trophy 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే నాలుగు మ్యాచ్లు పూర్తి అయ్యాయి. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఆదివారం రోజున పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా ( IND vs PAK ) మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ దుబాయ్ లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య జరిగే మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Also Read: Indian National Anthem: పాకిస్తాన్ గడ్డపై.. ఇండియా జాతీయగీతం… గూస్ బంప్స్ రావాల్సిందే !

Advertisement

అంటే ఈ మ్యాచ్ టాస్ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటలకు సరిగ్గా.. ఉండే ఛాన్స్ ఉంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన జట్టు… బౌలింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న ఇదే వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో చేజింగ్ చేసిన టీమిండియా… గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే అదే ఫార్ములాను ఈ మ్యాచ్ లో కూడా… అమలు చేసేలా టీమిండియా కసరత్తులు చేస్తోంది.

పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ లైవ్, టైమింగ్స్

Advertisement

ఆదివారం జరిగే పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్… జియో హాట్ స్టార్ లో తిలకించవచ్చు. తెలుగులో కూడా ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ లో వస్తుంది. స్టార్ స్పోర్ట్స్, న్యూస్ 18 లో కూడా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ప్రసారం అవుతుంది. తెలుగులో కామెంట్రీ చేసే వారి లిస్టు పరిశీలిస్తే…హనుమ విహారి, ఆర్ శ్రీధర్, MSK ప్రసాద్, T సుమన్, ఆశిష్ రెడ్డి, అక్షత్ రెడ్డి, NC కౌశిక్, మరియు కళ్యాణ్ కృష్ణ ఈ లిస్టులో ఉన్నారు.

ఇది ఇలా ఉండగా…. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో ఇప్పటికే…. టీమిండియా ఒక మ్యాచ్ గెలిచి… దుమ్ము లేపింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో పాకిస్తాన్ పై మ్యాచ్కు రెడీ అయింది. అటు ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మొదటి మ్యాచ్ ఓడిపోయిన పాకిస్తాన్…. టీమిండియా పై గెలిచేందుకు కసరత్తులు చేస్తోంది. 2017 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా పై గెలిచిన పాకిస్తాన్… ఛాంపియన్ గా నిలిచింది. ఆ ఒక్క పాజిటివ్ పాయింట్ తప్ప… పాకిస్తాన్ తరఫున ఎలాంటి భయానక వాతావరణం కనిపించడం లేదు. ఇటు విరాట్ కోహ్లీ తప్ప మిగతా ఆటగాళ్లందరూ ఫామ్ లోనే ఉన్నారు. కాబట్టి ఈసారి టీమిండియాను ఓడించడం పాకిస్తాన్ వల్ల అయ్యేలా కనిపించడం లేదు.

తెలుగు : హనుమ విహారి, ఆర్ శ్రీధర్, MSK ప్రసాద్, T సుమన్, ఆశిష్ రెడ్డి, అక్షత్ రెడ్డి, NC కౌశిక్, మరియు కళ్యాణ్ కృష్ణ

హిందీ – సిద్ధూ, హర్భజన్, రైనా, చోప్రా, రాయుడు, ఉతప్ప, వకార్, వహాబ్, జతిన్ & అనంత్.

ఇంగ్లీష్ – గవాస్కర్, శాస్త్రి, భోగ్లే, కార్తీక్, బిషప్, స్టెయిన్, అక్రమ్, రాజా & బాజిద్.

Also Read: PAK Team – ICC CT 2025: భారత్ చేతిలో ఓడితే పాకిస్థాన్ ఇంటికే… లెక్కలు ఇవే?

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×