BigTV English

Telangana : సెకండ్ షోలకు పిల్లలకు నో పర్మిషన్..తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Telangana : సెకండ్ షోలకు పిల్లలకు నో పర్మిషన్..తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

Telangana : సినిమాలంటే కొందరికి చాలా ఇష్టం. వయసుతో సంబంధం లేకుండా సినిమాలను చూసేందుకు ఇష్ట పడతారు. అంతే విధంగా పిల్లలు కూడా సినిమాలకు వెళ్లడం సరదాగా భావిస్తారు. హీరోల మీద ఇష్టంతో ఆ హీరోల సినిమాలను మొదటి రోజు చూడాలని పెద్దవాళ్ళ కన్నా ముందు పిల్లలే ఆసక్తి కనపరుస్తారు. ఇక పిల్లల కోరికలు తీర్చేందుకు తల్లిదండ్రులు కూడా వెనకాడరు. పిల్లలు ఇస్తాలే తమ ఇష్టాలుగా పిల్లలకు అడిగినట్లు సినిమా హాల్లోకి తీసుకొని వెళ్తున్నారు. స్టార్ హీరోల సినిమాలంటే ఫ్యాన్స్ తో పాటు జనాలు కూడా ఎక్కువగా థియేటర్లోకి వస్తారు. అలాంటి సమయాల్లో జనాల మధ్యలో పిల్లలు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇక తప్పని పరిస్థితుల్లో కొంతమంది పేరెంట్స్ ఎలాగోలాగా హాల్ లోపలికి వెళ్ళిపోతారు. మరి కొంతమంది బయట జనాల్లో ఇరుక్కుని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ హైకోర్టు కీలకతీర్పుని ఇచ్చింది. ఇకమీదట సెకండ్ షో సినిమాలకు కానీ ఫస్ట్ షో సినిమాలకు కానీ వెళ్లే పిల్లలకు ఏజ్ లిమిట్ ని పెట్టింది . ఏ వయసు పిల్లలు థియేటర్లకు ఏ సమయాల్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..


పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట.. 

గత ఏడాది డిసెంబర్లో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఆ సినిమాకు మొదటి రోజే పెద్ద షాక్ ఎదురైంది. సినిమాను చూసేందుకు చాలామంది అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్యా థియేటర్ దగ్గరికి హీరో అల్లు అర్జున్ సడన్ ఎంట్రీ ఇవ్వడంతో అక్కడున్న ఫ్యాన్స్ అల్లు అర్జున్ చూడడానికి ఉరుకులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ మరణించింది. ఆమె కుమారుడు ప్రస్తుతం ఆస్పత్రి బెడ్ పైన చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఘటనతో అల్లు అర్జున్ పై కేసు నమోదయింది ఆ తర్వాత బెయిల్ మీద ఆయన బయటకు వచ్చాడు. తను ఇప్పటికీ ఈ కేసు నుంచి అల్లు అర్జున్ బయటకు రాలేకపోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఒక నిండు ప్రాణం బలవడంతో తెలంగాణ ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఆ తర్వాత వచ్చిన సినిమాలకు స్పెషల్స్ అనుమతి ఇవ్వలేదని తెలిసిందే. తాజాగా హైకోర్టు కూడా సెకండ్ షో సినిమాలపై పిల్లల్ని ఆంక్షలు విధించింది..


తెలంగాణ హైకోర్టు ఆంక్షలు.. 

సినిమా థియేటర్లకు 16 ఏళ్ల లోపు పిల్లలు వెళ్లే సమయాల్లో ఆంక్షలు విధించింది తెలంగాణ హైకోర్టు. రాత్రి 11 సమయం నుంచి ఉదయం 11 గంటల వరకు పిల్లలకు థియేటర్లలోకి తీసుకురావడానికి అనుమతి ఇవ్వద్దని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈవిషయాన్ని అన్ని వర్గాలతో చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది. టికెట్ ధరల పెంపు, స్పెషల్ షో అనుమతులపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22 కు వాయిదా వేసింది.. పిల్లలకు ఆంక్షలు విధించిన హైకోర్టు ప్రభుత్వం బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఫిబ్రవరి ఇచ్చే ఫైనల్ తీర్పు వరకు వెయిట్ చేయాల్సిందే..

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×