Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాల కంటే వ్యక్తిత్వంతో ఎంతోమందికి దగ్గరయ్యాడు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా డార్లింగ్ పేరు తెచ్చుకున్నాడు. స్నేహానికి ఎంతో విలువను ఇస్తాడు. ఆ స్నేహంతోనే కొన్ని సినిమాలను కథ వినకుండానే ఓకే చేసిన రోజులు ఉన్నాయి. ఇక అదే స్నేహం కోసం.. మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటిస్తున్నాడు.
ఎన్నో ఏళ్లుగా మంచు విష్ణుకు సరైన హిట్ పడింది లేదు. మోహన్ బాబు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఎలాగైనా ఈసారి మంచి హిట్ కొట్టాలని తండ్రీకొడుకులు కలిసి కన్నప్ప సినిమాను నిర్మించారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మంచు విష్ణు హీరో అంటే ఎవరు రారేమో అని.. ఆ సినిమాలో కథను బట్టి అన్ని ఇండస్ట్రీల నుంచి స్టార్ హీరోలను తీసుకొచ్చాడు మోహన్ బాబు.
బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్.. తమిళ్ నుంచి శరత్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్ ను దింపాడు. ఇక టాలీవుడ్ నుంచి ప్రభాస్ ను తీసుకొచ్చాడు. మోహన్ బాబు, ప్రభాస్ కు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. ఆయన ఒక పాత్ర ఉంది చేయాలి అని అడగగానే డార్లింగ్ ఒప్పుకున్నాడని విష్ణు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కన్నప్ప లో ప్రభాస్ నటిస్తున్నాడు అని తెలియడంతో సినిమాపై ఒక హైప్ క్రియేట్ అయ్యింది.
NTR: హృతిక్ రోషన్ ముందు నేను దేనికి పనికి రాను.. ఎన్టీఆర్ వీడియో వైరల్
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఏ పోస్టర్ కు మంచి ప్రశంస దక్కలేదు. కేవలం ప్రభాస్ ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ? అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ ను చూపించి మంచు విష్ణు హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తున్నాడని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత శివుడిగా అక్షయ్ కుమార్ నటిస్తున్నాడని, నందీశ్వరుడిగా ప్రభాస్ కనిపిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.
ఇక తాజాగా ప్రభాస్ క్యారెక్టర్ కు సంబంధించిన ఒక వార్త సినిమాపై ఇంకా హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు ఎంట్రీ సాంగ్ కూడా ఉందంట. తాజాగా ఢీ షోలో హైపర్ ఆది ఈ విషయాన్నీ లీక్ చేశాడు. ఈ సాంగ్ కు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడట. ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ అందరూ.. ప్రభాస్ కు ఎంట్రీ సాంగ్ నా.. డ్యాన్స్ చేస్తాడా.. ? అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు.
డార్లింగ్ ఎంట్రీ సాంగ్ కు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటే.. భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ఎంట్రీ సాంగ్ కు థియేటర్ లో పూనకాలు రావడం ఖాయమని ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి ప్రభాస్ పేరు చెప్పుకొని మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.